Begin typing your search above and press return to search.

సమంతకు సాటిలేరు.. ఇప్పట్లో తిరుగులేదు..!

By:  Tupaki Desk   |   6 Jun 2021 6:30 AM GMT
సమంతకు సాటిలేరు.. ఇప్పట్లో తిరుగులేదు..!
X
'ఏమాయ చేసావే' తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సమంత.. ఫస్ట్ సినిమాతోనే తను మిగతా హీరోయిన్ల కంటే స్పెషల్ అనిపించుకుంది. ఈ క్రమంలో గ్లామరస్ రోల్స్ తో పాటుగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ గత కొన్నేళ్లుగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఈ జెనెరేషన్ హీరోయిన్లలో మామంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. నాగ చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ.. పెళ్లి అనేది హీరోయిన్ల కెరీర్‌ కు అడ్డంకి కాద‌ని నిరూపించింది. ఓవైపు వైవాహిక జీవితాన్ని మరోవైపు సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

నిజానికి అక్కినేని సమంత గా మారిన తర్వాత ఎంచుకున్న కథలు పాత్రలు ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అవే ఆమెను నటిగా మరో స్థాయికి చేర్చాయి. 'రంగస్థలం' సినిమాలో రామలక్ష్మి అనే గ్రామీణ యువతిలా డ్లీగామర్ పాత్ర పోషించిన సామ్.. తన పాత్రలో జీవించింది. ఆ తర్వాత వచ్చిన 'ఓ బేబీ' 'మజిలీ' సినిమాలలో మరింత పరిణితి చెందిన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ క్రమంలో 'సూపర్ డీలక్స్' సినిమాలో డేరింగ్ గా బోల్డ్ క్యారక్టర్ పోషించి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ లో రాజీ పాత్రలో నటించి తనకు సాటిలేరని నిరూపించింది సమంత.

సమంత డెబ్యూ వెబ్ సిరీస్ అవడం.. ఆల్రెడీ సూపర్ సక్సెస్ అయిన సిరీస్ కి రెండో భాగం అవడంతో 'ది ఫ్యామిలి మ్యాన్ 2' సిరీస్ పై అందరూ ఆసక్తి కనబరిచారు. తాజాగా విడుదలైన ఈ సిరీస్ లో సామ్ ని చూసిన ఆడియన్స్ ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. జీవితంలో ఎన్నో దెబ్బలు తిని, లైంగిక వివక్షకు గురైన రాజ్యలక్ష్మి గా.. తన వారి హక్కుల కోసం పోరాడటానికి ఎంతకైనా తెగించే ఎల్టీటీఈ సభ్యురాలు రాజీగా సమంత అద్భుతంగా నటించింది. డీ గ్లామ్ లుక్ లో కనిపించిన సామ్.. ఎమోషన్ తో పాటుగా యాక్షన్ సీన్స్ లో కూడా అదరగొట్టింది. కళ్ళతోనే హావభావాలు పలికించిన సమంత.. కెరీర్ లోనే బెస్ట్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ సిరీస్ తో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న సమంత అక్కినేని.. ప్రస్తుతం 'శాకుంతలం' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది.