Begin typing your search above and press return to search.

వారంలోనే... సమంత స్పీడ్‌ మామూలుగా లేదుగా!

By:  Tupaki Desk   |   1 April 2021 4:40 AM GMT
వారంలోనే... సమంత స్పీడ్‌ మామూలుగా లేదుగా!
X
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ లో సమంతది ప్రత్యేకమైన శైలి అనడంలో సందేహం లేదు. కెరీర్‌ ఆరంభం నుండి కమర్షియల్‌ సినిమాలు చేస్తూ వచ్చిన సమయంత పెళ్లి తర్వాత హఠాత్తుగా రూటు మార్చింది. ఆమె లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు ఓకే చెబుతోంది. కమర్షియల్‌ సినిమాలకు కాస్త దూరంను మెయింటెన్‌ చేస్తున్న ఈ అమ్మడు త్వరలోనే శాకుంతలం అనే భారీ పౌరాణికంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో వైపు వెబ్‌ సిరీస్‌ ప్రపంచంలోకి కూడా సమంత అడుగు పెట్టింది. సినిమాలతో మాత్రమే కాకుండా రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియా పోస్ట్‌ లతో సమంత సందడి చేస్తూనే ఉంటుంది. వారం రోజుల క్రితం సమంత ఇన్‌ స్టా గ్రామ్‌ ఫాలోవర్స్‌ సంఖ్య 15 మిలియన్‌ లకు చేరింది.

సౌత్‌ నుండి అతి కొద్ది మంది హీరోయిన్స్‌ మాత్రమే ఆ రేంజ్‌ లో ఫాలోవర్స్‌ ను కలిగి ఉన్నారు. కోటిన్నర క్లబ్‌ లో చేరిన సమంత చాలా స్పీడ్‌ గా రెండు కోట్ల క్లబ్‌ లో చేరి బాలీవుడ్‌ ముద్దుగుమ్మల సరసన నిలిచే అవకాశాలు కనిపిస్తుంది. 15 మిలియన్‌ లు క్రాస్‌ చేసి వారం రోజులకు అటు ఇటు అయ్యిందో లేదో అప్పుడే మరో మిలియన్‌ తో 16 మిలియన్‌ లకు సమంత ఫాలోవర్స్‌ సంఖ్య పెరిగింది. 16 వ మిలియన్‌ ఇంత తక్కువ సమయంలో కావడం బహుశా రికార్డ్‌ అయ్యి ఉంటుందని సమంత అభిమానులు అంటున్నారు. సమంత స్టార్‌ డం కు ఫాలోయింగ్‌ కు ఇది నిదర్శణం అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమంత తనకున్న క్రేజ్‌ నేపథ్యంలో సినిమాల సంఖ్య మరింతగా పెంచాలని అభిమానులు కోరుకుంటున్నారు.