Begin typing your search above and press return to search.

రైట్స్ లో సమంత కొత్త టర్న్

By:  Tupaki Desk   |   29 Jun 2018 11:05 AM GMT
రైట్స్ లో సమంత కొత్త టర్న్
X

ఈమధ్య కాలంలో సౌత్ సినిమాలంటే నార్త్ లో బాగానే క్రేజ్ పెరిగింది. లెక్కకు మిక్కిలిగా వచ్చిన టీవీ ఛానళ్లు.. యూట్యూబ్ ల పుణ్యమా అని మన సినిమాలన్నీ దాదాపుగా అన్నీ హిందీలోకి డబ్ అవుతున్నాయి. ఇదివరకు అంటే సినిమా రిలీజయ్యాక ఎంతో కొంత ఇచ్చి డబ్బింగ్ రైట్స్ తీసుకునేవారు. ఇప్పుడు నిర్మాణంలో ఉండగానే హిందీ డబ్బింగ్ కోసం అడ్వాన్సులిచ్చేస్తున్నారు.

సాధారణంగా తెలుగులో వచ్చే మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టెయినర్లకు హిందీలో డిమాండ్ ఎక్కువ. అందుకే వాటికోసం రూ. 2 కోట్ల వరకు రైట్స్ కోసం ఇస్తారు. స్టోరీ సినిమాలు.. ఫ్యామిలీ ఎంటర్ టెయినర్లు రూ. కోటికి అటూ ఇటూగా పలుకుతాయి. కానీ సమంత ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నటిస్తున్న ‘యు టర్న్’ సినిమాకు అప్పుడే ఫ్యాన్సీరేట్ ఇచ్చి రైట్స్ కొనేశారని టాలీవుడ్ టాక్. ఓ మర్డర్ ఇన్వెస్టిగేషన్ స్టోరీగా వస్తున్న ఈ మూవీ రైట్స్ కోసం రూ. 2.10 కోట్లు చెల్లించారని తెలుస్తోంది. ఇది మీడియం రేంజ్ హీరోల సినిమాకు ఇచ్చే మొత్తం కన్నా చాలా ఎక్కువే కావడం విశేషం.

కన్నడలో సూపర్ హిట్టయిన సినిమాకు రీమేక్ గా యు టర్న్ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఆది పినిశెట్టి - రాహుల్ రవీంద్రన్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. పవన్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఈమూవీకి మెయిట్ అట్రాక్షన్ సమంతనే. రంగస్థలం.. మహానటి సినిమాలతో సమంతకు హీరోయిన్ గా క్రేజ్ బాగా పెరిగింది. ఇప్పుడు హిందీ రైట్స్ కు భారీ మొత్తం రావడానికి ఇదే కారణం.