Begin typing your search above and press return to search.

కామెంట్: సమంత మూడు లవ్ సింబల్స్

By:  Tupaki Desk   |   9 Aug 2016 5:51 PM GMT
కామెంట్: సమంత మూడు లవ్ సింబల్స్
X
ఇప్పుడు సమంత ఏమి ట్వీటు చేసినా కూడా అది పెద్ద వార్తే. ఆ మధ్యన సరదాగా ట్విట్టర్లో మాట్లాడుతూ.. సెప్టెంబర్ లో పెళ్ళి చేసుకోవట్లేదని చెప్పింది. అంతకంటే ముందు తనకు 'ఎన్' లాకెట్ అంటే చాలా అమూల్యమైన విషయం అని కూడా చెప్పింది. మొత్తానికి ఇదంతా నాగ చైతన్య గురించే అని రూమర్లు వినిపిస్తున్న తరుణంలో.. ఇద్దరూ కలసే హైదరాబాదులో పలుమార్లు కెమెరాలకు చిక్కడం.. తరువాత బెల్జియంలో కూడా కలసే కనిపించడంతో.. ఇదంతా చాలా బలమైన 'ప్రేమ'ని బల్లగుద్ది చెప్పినట్లయింది.

ఆ ప్రేమ సంగతి తెలియదు కాని.. ఇప్పుడు ''ప్రేమమ్‌'' సినిమా గురించి మాత్రం అందరూ చర్చించుకుంటున్న సంగతి తెలిసిందే. మలయాళంలో ప్రేమమ్ సినిమా వచ్చినప్పుడు నివిన్ పౌళీ వేసే మూడు క్యారెక్టర్ల తాలూకు లుక్ ను చాలా సీక్రెట్ గా ఉంచారు. కాని ఇప్పుడు మాత్రం నాగ చైతన్య ఈ రీమేక్ సినిమాలో మూడు డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్‌ లైఫ్‌ లో ఎలా కనిపిస్తాడో క్లియర్ గా ఈ పోస్టర్లోనే చెప్పేశారు. అదంతా ఒకెత్తయితే ఈ పోస్టర్ గురించి ప్రస్తావించిన సమంత.. కేవలం మూడు లవ్ సింబల్స్ పోస్టు చేసి.. దాని పక్కన ఏమీ రాయకుండా లింక్ మాత్రమే ట్విట్టర్లో షేర్ చేసింది. ఇప్పుడు ఫిలిం నగర్ లో ఇదే హాట్ టాపిక్.

అబ్బే ఇందులో పెద్దగా అర్దంచేసుకోవాల్సిందే ఏముంది.. మూడు క్యారెక్టర్ల కోసం మూడు లవ్ సింబల్స్ అంతే. అంతే కదూ స్యామ్?