Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: సామ్ హాట్ లుక్ పై ఘాటు కామెంట్స్
By: Tupaki Desk | 24 May 2019 11:59 AM GMTసోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సమంత ఎప్పటికప్పుడు కొత్త ట్రెండీ డ్రస్ లతో ఆకట్టుకుంటూ ఉంటుంది. ట్రెండీ డ్రస్ లతో వావ్ అనిపించే సమంత అప్పుడప్పుడు తన ఓవర్ ట్రెండీ లుక్ తో విమర్శలపాలవ్వడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసారి సమంత వేసుకున్న డ్రస్ విమర్శల పాలయ్యింది. స్పెషల్ డిజైన్డ్ గౌన్ ధరించిన ఈమె స్టైల్ గా ఫొటోకు ఫోజ్ ఇచ్చింది. ఆ ఫొటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ ఫొటోకు పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. ఈ డ్రస్ నువ్వు అస్తి పంజరం ఉన్నట్లుగా ఉన్నావంటూ కొందరు.. ఇప్పటి వరకు నువ్వు వేసుకున్న డ్రస్ లలో అతి చెత్త డ్రస్ ఇదే అంటూ మరి కొందరు.. డైటింగ్ తగ్గించి కాస్త తిను అంటూ మరి కొందరు చిత్ర విచిత్రంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ డ్రస్ లో సమంత మరీ బక్కగా కనిపించడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత సమంత కాస్ట్యూమ్స్ మరియు ఆమె చేస్తున్న సినిమాల విషయంలో ఫ్యాన్స్ ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఆమె కాస్త హద్దు దాటినట్లుగా అనిపించినా కూడా సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరోసారి సమంత ట్రోలర్స్ కు పని చెప్పినట్లయ్యింది.
ఇక ప్రస్తుతం సమంత 'ఓ బేబీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతోంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈమె సినిమాలు చేస్తూ ఉంది. హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలపై ఆసక్తి చూపుతున్న సమంత 'ఓ బేబీ' చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.