Begin typing your search above and press return to search.

ప్రేక్షకుల వద్దకు రియల్‌ 'బేబీ'

By:  Tupaki Desk   |   7 July 2019 10:25 AM GMT
ప్రేక్షకుల వద్దకు రియల్‌ బేబీ
X
సమంత ప్రధాన పాత్రలో నటించిన 'ఓ బేబీ' చిత్రం ఇటీవలే విడుదలై మంచి స్పందన దక్కించుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుండి కూడా పాజిటివ్‌ రెస్పాన్స్‌ ను దక్కించుకుంది. ఈ చిత్రంలోని సమంత నటన సూపర్బ్‌ అంటూ అంతా ప్రశంసిస్తున్నారు. మంచి ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ ను రాబట్టిన ఈ చిత్రం ప్రమోషన్‌ కోసం సమంత స్వయంగా ప్రేక్షకుల వద్దకు వెళ్లేందుకు సిద్దం అయ్యింది.

తానో స్టార్‌ హీరోయిన్‌ అనే విషయాన్ని పట్టించుకోకుండా చిత్రం ప్రమోషన్‌ కోసం సమంత చాలా పాట్లు పడుతూ వచ్చింది. ఓ బేబీ చిత్రం ప్రమోషన్‌ కోసం దాదాపు మూడు వారాలుగా సమంత తెగ ఇంటర్వ్యూలు షో లు అంటూ బిజీ బిజీగా గడుపుతూనే ఉంది. అన్ని షోలను కవర్‌ చేసిన సమంత పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. తాజాగా సమంత 'ఓబేబీ' ఆడుతున్న థియేటర్ల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుంది.

నందిని రెడ్డితో పాటు సమంత ప్రేక్షకుల ముందుకు వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకుంది. సమంత తాజాగా హైదరాబాద్‌ లోని థియేటర్ల వద్దకు వెళ్లింది. నైజాంతో పాటు ఆంధ్రా మరియు సీడెడ్‌ థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులను పలకరించాలని సమంత అండ్‌ టీం నిర్ణయించుకున్నారు. ఒక హీరో మాదిరిగా సినిమా ప్రమోషన్‌ బాధ్యతను తన నెత్తిన వేసుకున్న సమంతను చూసి ఇతర హీరోయిన్స్‌ నేర్చుకోవాల్సింది చాలానే ఉంది.