Begin typing your search above and press return to search.

మరోసారి బతకమంటున్న సమంత

By:  Tupaki Desk   |   5 Nov 2015 3:00 PM IST
మరోసారి బతకమంటున్న సమంత
X
సౌత్ బ్యూటీ సమంత సినీరంగంలోనే సేవా కార్యక్రమాల్లోనూ బాగా యాక్టివ్. తనే ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి మరీ సేవ చేస్తోంది. సమస్యలపై నిలదీయడం - ప్రశ్నించడం - అభిప్రాయాలు చెప్పడమే కాదు.. వీలైనంతగా తనవంతు సాయం చేస్తుంది శామ్స్. తాను అందుకునే పారితోషికంలో చాలా భాగం ఇలా సేవా కార్యక్రమాలకే వెచ్చిస్తూ సెలబ్రిటీల్లో విభిన్నంగా నిలుస్తోంది. పలువురుగా ఆదర్శంగా ప్రవర్తిస్తోంది.

ఛారిటీ సంస్థతో పాటు.. ఇప్పుడో మరో మహోద్యమం లాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించబోతోంది సమంత. అదే అవయవదానం. నూటపాతిక కోట్ల జనాభా ఉన్న మన దేశంలో.. రోజూ లక్షల్లో మరణాలు సంభవిస్తున్నా.. ఎంతో మంది రోగులు అవయవాలు లభించక నానా అగచాట్లు పడుతున్నారు. అందుకే ముందుగా తానే అవయవదానానికి ప్రతిజ్ఞ చేసి, ఇతరులనూ ఇదే చేయాలని కోరనుంది. నవంబర్ 7న హైద్రాబాద్ లో గ్రాండ్ గా ఓ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది ప్రముఖ హాస్పిటల్. ఈ ఫంక్షన్ వేదికగా.. అవయవదానానికి ప్రచారం చేయనుంది. ఒకసారి జీవితంతో ఆగిపోవద్దు.. అంటూ ప్రచారం చేయనుంది. సినిమాలతో కోట్లు కూడబెట్టుకోవడంతో సరిపెట్టుకోకుండా.. ఇలా పదిమందికీ ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో.. సమంతకు అభిమానులు విపరీతంగా పెరుగుతున్నారు.

తమ అభిమాన తార చేపడుతున్న అద్భుతమైన సేవా కార్యక్రమాలపై సంతోషం వెలిబుచ్చుతూ.. తామూ వీటికి వీలైనంతగా మద్దతు పలుకుతామని చెబ్తున్నారు. ప్రస్తుతం తమిళ మూవీస్ లో బాగా బిజీగా ఉన్న సమంత.. తెలుగులో త్రివిక్రం డైరెక్షన్ లో నితిన్ హీరోగా వస్తున్న అ..ఆ.. చిత్రంలో నటిస్తోంది. త్వరలో మహేష్ బాబు బ్రహ్మోత్సవం షూటింగ్ లోనూ జాయిన్ కానుంది.