Begin typing your search above and press return to search.

సినిమాలకు బ్రేక్ చెప్పనున్న అక్కినేని కోడలు.. అదే కారణమా..?

By:  Tupaki Desk   |   4 March 2021 8:18 AM GMT
సినిమాలకు బ్రేక్ చెప్పనున్న అక్కినేని కోడలు.. అదే కారణమా..?
X
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం తన ఫ్యూచర్ సినిమాల పట్ల నెమ్మదించినట్లే అనిపిస్తుంది. ప్రస్తుతం పలువురు దర్శకులు స్క్రిప్టులు పట్టుకొని సమంతను ఆశ్రయిస్తున్నా ఎలాంటి స్క్రిప్ట్ కూడా ఓకే చేసే ఆలోచనలో లేదని టాక్. వాస్తవానికి సామ్ కెరీర్ ప్రారంభించి పదేళ్లు కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడైనా సినిమాలకు కొంతకాలం బ్రేక్ చెబితే బాగుంటుందని అనుకుంటుందట. నాగచైతన్య సరసన 'ఏమాయచేసావే' సినిమాతో కెరీర్ ప్రారంభించిన సామ్.. అప్పటినుండి ప్రతి ఏడాది గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉంది. అంతేగాక ఫ్యాన్స్ ఎక్సపెక్ట్ చేసినట్లుగా అభినయానికి స్కోప్ ఉన్న సినిమాలే చేస్తోంది. అయితే పదేళ్ల తర్వాత ఓ భారీ ప్రాజెక్ట్ ఫినిష్ చేసి లాంగ్ బ్రేక్ తీసుకోవాలని సామ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.

నిజానికి జాను ప్లాప్ తర్వాత తెలుగులో సామ్ ఏ సినిమా కూడా ఓకే చేయలేదు. మధ్యలో ఎన్నో పుకార్లు వచ్చినప్పటికి గుణశేఖర్ తెరకెక్కించనున్న శకుంతల మూవీకి సంతకం చేసింది సమంత. ప్రస్తుతం ఆ మూవీకి సంబంధించిన సెట్ వర్క్ జరుగుతోందట. అలాగే ఈ పాన్ ఇండియా మూవీ రెగ్యులర్ షూట్ ఈ నెలలోనే హైదరాబాద్‌లో ప్రారంభమవుతుందని టాక్. అయితే ఈ సినిమా తర్వాతే బ్రేక్ తీసుకోవాలని.. అందుకే కొత్త ప్రాజెక్టులపై సంతకం చేయట్లేదని వార్తలొస్తున్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం.. సామ్ కొంతకాలం సినిమాలకు బ్రేక్ చెప్పి తన పర్సనల్ మారీడ్ లైఫ్ కోసం సమయం కేటాయించనుందని అంటున్నాయి సన్నిహితవర్గాలు. నాగచైతన్యతో సామ్ పెళ్ళై నాలుగేళ్లు దగ్గరపడింది. ఇంతవరకు ఫ్యామిలీ పరంగా ఎలాంటి టైం స్పెండ్ చేయలేదని సినీవర్గాలలో టాక్. చూడాలి మరి సామ్ ఏం చేయనుందో.. ప్రస్తుతం ఈ భామ కాతువకుల రెండు కాదల్ అనే తమిళ సినిమాలో నటిస్తోంది.