Begin typing your search above and press return to search.
నెగటివ్ రోల్ నా డ్రీమ్.. అంటున్న స్టార్ హీరోయిన్
By: Tupaki Desk | 15 May 2020 9:00 AM ISTఅక్కినేని సమంత.. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన 'ఏమాయ చేసావే' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన విషయం తెలిసిందే. కెరీర్ ప్రారంభం నుండి నటనకు అవకాశం ఉన్న చిత్రాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది సమంత. ఇక తన మొదటి హీరో నాగచైతన్యనే వివాహం చేసుకుని తెలుగింటి కోడలైంది. కెరీర్ ప్రారంభంలో అందాల ఆరబోత కూడా చేసి కుర్రకారుకి నిద్రలేకుండా చేసింది. సమంత నటించిన తాజా సినిమా జాను. తమిళ సినిమా 96కు తెలుగు రీమేక్ ఇది. మంచి అంచనాల మధ్య విడుదలై పెద్దగా అలరించ లేకపోయింది. అయినా.. 'జాను'లో సమంత నటనకు మంచి ప్రశంసలే దక్కాయి. ఆ సినిమా తర్వాత సమంత తన తదుపరి చిత్రం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో చేయనున్నారని తెలుస్తోంది. గత ఏడాది వీరి కాంబినేషన్ లో 'ఓ బేబీ' వచ్చి మంచి హిట్ అందుకుంది. అయితే కాస్త గ్యాప్ తీసుకొని వెబ్ సిరీస్ వైపు మళ్లింది సమంత.
బాలీవుడ్ స్టార్ యాక్టర్ మనోజ్ వాజ్‌పేయి ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. గతేడాది సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను మెప్పించి మంచి సక్సెస్ అందుకుంది. ఇందులో మధ్య తరగతికి చెందిన ఓ వ్యక్తి జాతీయ దర్యాప్తు సంస్థకు ఏజెంట్‌గా పనిచేసే పాత్రలో మనోజ్ కనిపించాడు. ఇందులో ప్రియమణి, నీరజ్ మాధవ్, పవన్ చోప్రా, కిషోర్ కుమార్ కీలకపాత్రలు పోషించడం జరిగింది. తాజాగా దీనికి సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ రూపొందుతుంది. ఇందులో సమంత నెగటివ్ రోల్ లో నటించబోతున్నారని దర్శకుడు రాజ్ నిడిమోరు డీకే కృష్ణ గతంలోనే ప్రకటించారు. అంతే కాకుండా సమంత పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని తెలిపడం జరిగింది. ఆ తర్వాత సమంత ఇంస్టాగ్రామ్ లో స్పందించి.. ‘నేను నటించబోతున్న మొదటి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2′. దీని కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఓ డ్రీమ్ రోల్ ను నాకు ఇచ్చినందుకు ప్రతిఒక్కరికీ నా ధన్యవాదాలు’ అని సమంత తెలిపింది. అంటే నెగటివ్ రోల్ చేయడం సమంత డ్రీం రోల్ అన్నమాట అని ఫ్యాన్స్ ఎక్సయిట్ అవుతున్నారు.