Begin typing your search above and press return to search.

'ఆ' రెస్టారెంట్ ను ఆరంభిస్తున్న 'అ'

By:  Tupaki Desk   |   18 Nov 2016 3:54 AM GMT
ఆ రెస్టారెంట్ ను ఆరంభిస్తున్న అ
X
అ..ఆ.. మూవీలో ఆనంద్ విహారిగా అలరించిన యంగ్ హీరో నితిన్.. ఇప్పటికే పలు సినిమా సంబంధిత వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. సొంత ప్రొడక్షన్ హౌస్ ఉండగా.. డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం కూడా మనోడికి కొట్టిన పిండే. ఇప్పుడు సినిమాకి సంబంధం లేని ఓ కొత్త వ్యాపారం మొదలుపెడుతున్నాడు నితిన్.

డిజైనర్ నీరజ కోన.. ఆమె భర్తతో సహా సహా పలువురు స్నేహితులతో 'టీ-గ్రిల్' అనే పేరుతో రెస్టారెంట్ ఆరంభిస్తున్న సంగతి తెలిసింది. దీనికి అర్ధం టాలీవుడ్ గ్రిల్ అని కూడా ఓ సారి చెప్పారు ఓనర్స్. ఇప్పుడీ రెస్టారెంట్ ప్రారంభానికి అ..ఆ..లో తనకు జోడీగా నటించిన అనసూయా రామలింగం పాత్రధారి సమంతను తెచ్చుకుంటున్నాడు నితిన్. హైద్రాబాద్ లోని మాదాపూర్ లో ఇవాళే ఈ రెస్టారెంట్ గ్రాండ్ ఓపెనింగ్ జరగనుంది.

సమంత చేతుల మీదుగా టీ గ్రిల్ ఆరంభం కానున్నా.. ఇంకా అనేక మంది సినీ స్టార్లు..సెలబ్రిటీలు.. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోనున్నారు. టీ గ్రిల్ లో టేస్ట్ చేయనున్నారు. అయితే.. తనే ఓ స్టార్ రేంజ్ ఉన్న హీరో అయినా.. తను ప్రారంభించే రెస్టారెంట్ కి మరో స్టార్ హీరోయిన్ ని తెచ్చుకోవడం.. నితిన్ కే చెల్లింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/