Begin typing your search above and press return to search.

బాబోయ్‌... సమంత ఇప్పటి కంటే డబుల్‌ చేయనుందట!

By:  Tupaki Desk   |   13 March 2022 9:30 AM GMT
బాబోయ్‌... సమంత ఇప్పటి కంటే డబుల్‌ చేయనుందట!
X
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తోంది. ఆమె హాట్ ఫోటోలు.. వాటికి అభిమానులు చేసే కామెంట్స్ వల్ల వార్తల్లో ఉంటోంది. కొన్ని సార్లు ఆ కామెంట్ కి ఆమె సీరియస్ గా స్పందించడం వల్ల కూడా ఆమెను వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా ఆమె ఈ మధ్య కాలంలో సమంత వర్కౌట్లు చేస్తూ ఫిజిక్ పై దృష్టి పెట్టి షేర్ చేస్తున్న వీడియో లు మరియు ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

ప్రతి రోజూ గంటల తరబడి వర్కౌట్లు చేస్తూ గడిపే సమంత తన వర్కౌట్ టైం డబల్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా ఇప్పటి వరకు పడుతున్న కష్టం కు డబల్ కష్టపడబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకు కారణం ఆమె త్వరలో హిందీలో చేయబోతున్న ఒక వెబ్ సిరీస్. బాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ది ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్ సిరీస్ దర్శక ద్వయం తెరకెక్కించబోతున్న ఒక భారీ వెబ్ సిరీస్ లో సమంత కీలక పాత్రలో కనిపించబోతుంది.

ఆ పాత్రకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా ఉన్నాయి. హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ కి రీమేక్‌ అని తెలుస్తుంది. ఆ వెబ్‌ సిరీస్‌ లో యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని తెలుస్తోంది. ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ కోసం సమంత పడ్డ కష్టం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. నెగటివ్ షేడ్స్ తో పాటు బోల్డ్‌ సన్నివేశాల్లో నటించడంతో పాటు యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించి మెప్పించింది.

నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించి మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు సమంత ను లీడ్‌ రోల్‌ లో చూపిస్తూ ఈ వెబ్ సిరీస్ ని దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ఈ ఏడాది ద్వితీయార్థం లో షూటింగ్ కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయి.

వెబ్ సిరీస్ లో సామ్‌ ఫిజిక్‌ మరియు యాక్షన్ సన్నివేశాల ప్రతిభ కీలకంగా ఉంటుందట. అందుకే యాక్షన్ సన్నివేశాల కోసం ట్రైనింగ్ తీసుకోబోతున్నట్లు గా తెలుస్తోంది. అందుకోసం ముంబైలో ఆమె చాలా రోజుల పాటు ఉండబోతుంది. యాక్షన్ సన్నివేశాల కోసం వర్క్ షాప్ లో సమంత పాల్గొని ఇప్పటి వరకు చేసిన వర్కౌట్‌ కి డబుల్ చేసి యాక్షన్ సన్నివేశాలకు రెడీ అవుతోంది.

ఇక సమంత ఇతర సినిమాల విషయానికి వస్తే తెలుగులో ఈమె చేసినా శాకుంతలం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా నుండి ఇటీవలే ఫస్ట్ లుక్ వచ్చింది. అందులో సామ్‌ చాలా అందంగా కనిపించి ఆకట్టుకుంది. మరోవైపు యశోద అనే భారీ పాన్ ఇండియా సినిమా లో కూడా సామ్‌ చేస్తోంది.

ఇవి కాకుండా హిందీలో రెండు సినిమా లు చేయబోతున్నట్లుగా వార్తలు మొదలయ్యాయి. మొత్తానికి సమంత ఫుల్ బిజీగా ఉన్నా కూడా యాక్షన్ సన్నివేశాల కోసం వర్క్ షాప్ కు హాజరు అవ్వడం అంటే కచ్చితంగా ఆమె వర్క్ డెడికేషన్ కి అభినందనలు తెలియజేయాల్సిందే అంటూ కామెంట్స్ వస్తున్నాయి.