Begin typing your search above and press return to search.

సమంత - తాప్సీ జోడీ 'లేడీ రెబ‌ల్'?

By:  Tupaki Desk   |   5 July 2022 3:29 AM GMT
సమంత - తాప్సీ జోడీ లేడీ రెబ‌ల్?
X
పురుషాధిక్య ప్ర‌పంచాన్ని ఎదురించ‌డంలో తాప్సీ ఎప్పుడూ ముందుంటుంది. పారితోషికాలు స‌హా అన్నిటా హీరోల‌తో హీరోయిన్ల‌కు స‌మానత్వం కావాల‌ని పోరాడుతోంది. ఇక ఈ పురుష ప్ర‌పంచాన్ని తాప్సీ దృక్కోణంలో చూస్తే అది ఒక పెద్ద స‌బ్జెక్ట్ అవుతుంది. ఇది కేవ‌లం స‌మాన‌త్వం కోసం పోరాటం. ఇక పురుషాధిక్య ధోర‌ణి గురించి స‌మంత ఎప్పుడూ అంత‌గా మీడియాకెక్క‌లేదు కానీ.. త‌న‌లోని ఇన్న‌ర్ భావ‌జాలాన్ని అణ‌చిపెట్టుకునేందుకు స‌మంత సిద్ధంగా లేదు. అయితే అలాంటి ఇద్ద‌రి క‌ల‌యిక‌లో ఒక సినిమా వ‌స్తే అది ఎలా ఉంటుందో ఊహించ‌గ‌లం. ఇది క‌చ్ఛితంగా పురుషాధిక్యాన్ని నిల‌దీసే చిత్ర‌మే అవుతుంద‌ని ఊహాగానాలు సాగుతున్నాయి. ఫ్యామీలీమ్యాన్ 2లో రాజీ పాత్ర‌తో పాన్ ఇండియా ఆడియెన్ కి క‌నెక్ట‌యిన స‌మంత అయితేనే స‌రిగ్గా సూట‌వుతుంద‌ని భావించిన తాప్సీ ఇప్పుడు నిర్మాత‌గా సొంత బ్యాన‌ర్ లో తెలివిగా ఒక పాన్ ఇండియా సినిమాకి ప్లాన్ చేస్తోంది.

సమంత ప్ర‌ధాన పాత్ర‌లో తాప్సీ ఈ సినిమాని నిర్మిస్తోంద‌ని ఇంత‌కుముందే క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. ఎట్టకేలకు దీని గురించి తాప్సీ ఓపెన్ అయ్యింది. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న త‌న చిత్రం 'శభాష్ మిథు' ప్రమోషన్స్ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ సామ్ తో ప్రాజెక్ట్ గురించి వెల్ల‌డించింది. ఈ చిత్రంలో తాను ఎలాంటి పాత్ర చేయడం లేదని సమంతా స్వయంగా లీడ్ పాత్ర‌లో న‌టిస్తుంద‌ని చెప్పింది. సామ్ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ సినిమా చేయడానికి త‌ను మాత్ర‌మే పర్ఫెక్ట్ ఫిట్ అని తాప్సీ చెప్పింది. ఈ ప్రాజెక్ట్ హిందీ చిత్రసీమలో సమంతకు తొలి భారీ చిత్రం కానుంది. త్వరలోనే అధికారికంగా ప్ర‌క‌టిస్తారు.

తాప్సీ ఓవైపు న‌టిగా బిజీగా కొన‌సాగుతూనే మ‌రోవైపు నిర్మాత‌గానూ సినిమాలు చేస్తున్నారు. స‌మంత ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉంది. త‌దుప‌రి అక్షయ్ కుమార్ తో కలిసి కాఫీ విత్ కరణ్ సీజన్ 7 లో క‌నిపించ‌నుంది. అయితే ఈ షోలో వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అనే వివరాలు మాత్రం షేర్ చేయలేదు. స‌ల్మాన్ ఖాన్ నో ఎంట్రీలో సమంత‌కు ఆఫ‌ర్ వ‌చ్చింద‌న్న ప్ర‌చారం కూడా సాగుతోంది.

సమంత గ‌త చిత్రం 'కాతు వాకులా రెండు కాదల్‌' సంతృప్తిక‌ర ఫ‌లితాన్ని అందించింది. నయనతార- విజయ్ సేతుపతి- స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల్లో విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు విమర్శకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. మ‌రోవైపు సామ్ న‌టిస్తున్న 'యశోద' చివరి షెడ్యూల్ షూటింగ్ లో ఉంది. ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. అలాగే త‌న‌ 'శాకుంతలం' విడుదల కోసం ఎదురుచూస్తోంది.

విజయ్ దేవరకొండతో కలిసి న‌టిస్తున్న 'ఖుషీ' షెడ్యూళ్లు కొన‌సాగుతున్నాయి. రెండవ షెడ్యూల్ జూన్ 8 నుండి కొన‌సాగుతోంది. అలాగే అవెంజ‌ర్స్ మేక‌ర్స్ రస్సో బ్రదర్స్ నిర్మిస్తున్న 'సిటాడెల్'లోనూ సామ్ న‌టిస్తోంది. వరుణ్ ధావన్- స‌మంత‌ ప్రధాన పాత్రల్లో రాజ్ నిడిమోరు -కృష్ణ డికె ద‌ర్శ‌క‌త్వంలో ఈ సిరీస్ తెర‌కెక్క‌నుంది.

జూలై నుంచి ఈ సిరీస్ సెట్స్ పైకి వెళుతుంద‌ని స‌మాచారం. ఫ్యామిలీమ్యాన్ 2 త‌ర్వాత సామ్ కి రాజ్ అండ్ డీకేతో అద్భుత అవ‌కాశ‌మిది. బాఫ్టా-విజేత దర్శకుడు ఫిలిప్ జాన్ తెర‌కెక్కించ‌నున్న‌ చిత్రం 'అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్‌'తో సమంత హాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది. ఇన్ని షెడ్యూళ్ల న‌డుమ తాప్సీ నిర్మాణ సంస్థ‌కు సామ్ ఓకే చెప్ప‌డం ఆస‌క్తిక‌రం. ఇది మూడు సినిమాల డీల్ అన్న గుస‌గుసా వినిపిస్తోంది.