Begin typing your search above and press return to search.

డాక్యుమెంటరీ లో సమంత

By:  Tupaki Desk   |   7 Aug 2017 7:35 AM GMT
డాక్యుమెంటరీ లో సమంత
X
టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్లలో ఒకరు సమంత రూత్ ప్రభు. ఏ మాయ చేశావే సినిమాతో కుర్రకారు మనస్సును దోచుకున్న ఈ బ్యూటీ కొద్దీ కాలానికే నాగ చైతన్య కు ఫిదా అయిపొయింది. అక్కినేని కుటుంబంలో కొడలిగా స్థానం సంపాదించుకోబోతున్న సమంత ప్రస్తుతం బిజీ షెడ్యూల్ తో ఉంది. రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన లో తెరకెక్కుతున్న "రంగ స్థలం 1985" తో పాటు - సావిత్రి బయోపిక్ మరియు షూటింగ్ లలో సమంత గ్యాప్ వర్క్ చేస్తోంది.

అయితే చేనేత కార్మికుల కోసం ప్రచారాకర్తగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.. ఇంత బిజీ షెడ్యూల్ లో ఉండి కూడా సమంత సమయం దొరికితే.. ప్రచారాల్లో చేనేత వస్త్రాల కు బాగానే ప్రచారాన్ని చేస్తూ.. దేశ విదేశాల్లో కూడా ఈ అమ్మడు వాటి విలువలను తెలియస్తోందట. అంతే కాకుండా ఇంతవరకు ఎవరు చేయని ఓ కొత్త తరహాలో చేనేత కార్ముకుల బ్రతుకును, వారి కష్టాలను ఒక డాక్యుమెంటరీ ద్వారా ప్రజలకు తెలియజేయనుందని తెలుస్తోంది.

ఈ తరహా డాక్యుమెంటరీని తెలంగాణ రాష్ట్రానికి చెందిన దూలం సత్యనారాయణ తియనున్నాడట. సత్యనారాయణ డాక్యుమెంటరీ లను తీయడంలో మంచి అవగాహన ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ డాక్యుమెంటరీ రెడీ చేయనున్నారని సమాచారం. మరి ఆ డాక్యుమెంటరీలో సమంత ఏ విధమైన పాత్ర చేస్తుందా అని ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. చూడాలి మరి సమంత ఎంత వరకు ఈ ప్రయోగాన్ని సక్సెస్ చేస్తుందో!!