Begin typing your search above and press return to search.

బాలీవుడ్ డెబ్యూలో డ్యూయల్ రోల్ లో సౌత్ క్వీన్..?

By:  Tupaki Desk   |   6 Sep 2022 3:30 PM GMT
బాలీవుడ్ డెబ్యూలో డ్యూయల్ రోల్ లో సౌత్ క్వీన్..?
X
సౌత్ క్వీన్ సమంత రూత్ ప్రభు 'ది ఫ్యామిలీ ఫమ్యాన్ 2' వెబ్ సిరీస్ తో జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. అలానే 'పుష్ప' సినిమాలో 'ఊ అంటావా మావా' అంటూ ఐటమ్ సాంగ్ తో ఊపేసింది. ఈ క్రమంలో ఆమె నేరుగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వచ్చాయి.

సమంత ఇప్పటికే పలు హిందీ ప్రాజెక్ట్స్ కు సైన్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఓ హిందీ వెబ్ సిరీస్ కు కూడా కమిట్ అయింది. హీరోయిన్ తాప్సీ పన్ను తన సొంత నిర్మాణ సంస్థలో సమంతతో సినిమా చేస్తున్నట్టు ధృవీకరించింది. ఇదే సామ్ బాలీవుడ్ డెబ్యూ అవనుందని అందరూ అనుకున్నారు.

అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి ముందే సమంత మరో హిందీ ప్రాజెక్ట్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సామ్ ని హీరోయిన్ గా తీసుకున్నారని టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు కానీ.. ఆమె పాత్ర గురించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

సమంత ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నట్లు టాక్స్ వినిపిస్తున్నాయి. రెండు పాత్రలు కూడా వేటికవే ప్రత్యేకంగా నిలుస్తాయని.. కచ్చితంగా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెడతాయని అంటున్నారు. ఆయుష్మాన్ ఖురానా రోల్ కు ధీటుగా సామ్ క్యారక్టర్ ఉంటుందని చెబుతున్నారు.

సమంత గతంలో '10 ఎండ్రతుకుల్ల' (తెలుగులో '10') అనే మూవీ తమిళ మూవీతో మొట్టమొదటి సారిగా డ్యూయల్ రోల్ లో కనిపించింది. అందులో ఒక పాత్ర నెగెటివ్ షేడ్స్ తో ఉంటుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అవ్వడంతో సమంత ద్విపాత్రాభినయం గురించి ఎవరూ పట్టించుకోలేదు.

ఇప్పుడు డ్యూయల్ రోల్ తోనే సమంత హిందీలో ఎంట్రీ ఇవ్వబోతోందని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ప్రస్తుతం సామ్ మరియ ఆయుష్మాన్ ఖురానా కలిసి వర్క్ షాప్ లో పాల్గొంటున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

ఇకపోతే సమంత 'శాకుంతలం' మరియు 'యశోద' సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించబోతోంది. అలానే విజయ్ దేవరకొండ పక్కన హీరోయిన్ గా 'ఖుషి' సినిమా చేస్తోంది. రాజ్ & డీకే దర్శకత్వంలో వరుణ్ ధావన్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేయనుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.