Begin typing your search above and press return to search.

సమంత పనికిరాదన్నారట! సీక్రెట్ విప్పిన ‘సామ్ జామ్’ హోస్ట్

By:  Tupaki Desk   |   25 Dec 2020 10:00 AM IST
సమంత పనికిరాదన్నారట! సీక్రెట్ విప్పిన ‘సామ్ జామ్’ హోస్ట్
X
ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మూవీతోనే ‘ఏమాయ చేసావే..’ అంటూ కుర్రకారును మెస్మరైజ్ చేసిన బ్యూటీ సమంత. లైట్ బబ్లీ లుక్ తో.. షార్ట్ అండ్ స్వీట్ డైలాగ్స్ తో.. సమంత ప్లే చేసిన రోల్ కు యూత్ ఫిదా అయిపోయాారు. తొలి చిత్రంతోనే ఆడియన్స్ హార్ట్ రాబరీచేసిన ఈ భామ.. వరుస హిట్లతో టాప్ రేంజ్ కు దూసుకెళ్లింది. అందమే కాదు.. అమ్మడు అభినయం కూడా సూపర్బ్ అని క్లాప్స్ కొట్టించుకుంది. అలాంటి సామ్.. ఓ పాత్రకు పనికిరాదన్నారట!

లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో టాలీవుడ్ లోనే కాకుండా.. సౌత్ లోనూ టాప్ పొజిషన్ లో ఉంది సామ్. సమంత కనిపిస్తే వెండి తెర మరింత వెలిగిపోతుందని ఇటు మేకర్స్.. అటు వ్యూవర్స్ ఫిక్స్ అయిపోయారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పైనా వండర్స్ క్రియేట్ చేస్తోంది అక్కినేని కోడలు. సెలక్టివ్ రోల్స్ తో అటు బిగ్ స్క్రీన్ లో కంటిన్యూ అవుతూనే.. బుల్లితెరపైనా తన మార్క్ రోల్ ప్లే చేస్తోంది. బిగ్‌బాస్ 4 సీజన్‌లో అనుకోని అవకాశాన్ని చేజిక్కించుకొన్న ఈ బ్యూటీ హోస్ట్‌గా అదరగొట్టింది. ఇప్పుడు.. ‘ఆహా’ ఓటీటీ యాప్‌లో ‘సామ్ జామ్’ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ జామ్ జామ్ అంటూ దూసుకెళ్తోంది. ఈ షోలో తనకు ఎంతో పేరు తెచ్చిన డిఫెంట్ రోల్ ‘రామలక్ష్మి’ వెనక సీక్రెట్ గురించి చెప్పింది సామ్.

ఇటీవల ‘సామ్ జామ్‌’లో హీరోయిన్ రకుల్, స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పాల్గొన్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ గ్రామీణ నేపథ్యం ఉన్న చిత్రం రాబోతోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రకుల్ పల్లెటూరి పిల్లగా, డీ గ్లామరస్ రోల్ లో కనిపించబోతోంది. ఈ మూవీ డీటెయిల్స్ డిస్కస్ చేస్తుండగా.. సమంత నటించిన ‘రంగస్థలం’ మూవీ చర్చకు వచ్చింది.

రకుల్ ప్రీత్ సింగ్ అంటే గ్లామర్ క్వీన్. అలాంటి బ్యూటీతో పల్లెటూరి యువతి పాత్ర చేయించాలని అనుకొన్నాను. ‘కొండ పొలం’ అనే పుస్తకం చదివిన తర్వాత వచ్చిన థాట్ తో రకుల్ ను అప్రోచ్ అయ్యానని చెప్పారు డైరెక్టర్ క్రిష్. కథ చెప్పగానే.. తన ఇమేజ్ ను పక్కనపెట్టి యాక్ట్ చేయడానికి రకుల్ ముందుకొచ్చిందని చెప్పారు. కానీ.. రకుల్‌ను గ్లామర్‌కు దూరంగా ఉండే పాత్రలో ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అనే డౌట్ ఇంకా వెంటాడుతూనే ఉంది అన్నారు క్రిష్.

దీంతో.. తన రామలక్ష్మి పాత్ర గురించి చెప్పింది సమంత. ‘రంగస్థలం’ చిత్రంలో రామలక్ష్మీ పాత్రకు తనను ఎంచుకున్నప్పుడు.. సమంత అయితే వద్దు అని చెప్పారట అసిస్టెంట్ డైరెక్టర్లు. ఆమె గ్లామర్ హీరోయిన్ కాబట్టి, డీ గ్లామరస్ రోల్ లో చూడటానికి ప్రేక్షకులు ఒప్పుకొంటారో లేదో తెలియదని, రామలక్ష్మి పాత్రకు సమంత సరిపోతుందో లేదో అనే అనుమానాన్ని వ్యక్తం చేశారని వెల్లడించింది సమంత.

సుకుమార్ ఆఫర్‌తో రామలక్ష్మి పాత్ర చెప్పినప్పుడు తాను చాలా ఎక్సైటింగ్‌ అయ్యానని, ఆ పాత్ర తనకు ఛాలెంజిగ్‌గా అనిపించిందన్నారు సమంత. సినిమా రిలీజ్ తర్వాత వచ్చిన రెస్పాన్స్ అద్బుతంగా అనిపించిందని, కెరీర్‌లో అలాంటి పాత్రలు చేయడం వల్ల కొత్త అనుభూతిని పొందడానికి అవకాశం ఏర్పడుతుందని సమంత చెప్పింది. అంటే.. రకుల్ పాత్ర విషయంలో ‘డోన్ట్ వర్రీ బాస్’ అంటూ డైరెక్టర్ కు సామ్ ధైర్యం చెప్పినట్టేగా?!