Begin typing your search above and press return to search.
తన ఫేవరేట్ బాలీవుడ్ హీరో పేరు చెప్పేసిన సమంత..!
By: Tupaki Desk | 23 May 2021 5:00 AM ISTసినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ మనసు విప్పడం అరుదుగా జరుగుతుంది. అంటే అన్ని విషయాలు చెప్పుకుంటారేమో గాని కొన్ని విషయాలు మాత్రం సీక్రెట్ గా ఉంచుతారు. అలాంటి విషయాల్లో ఫేవరేట్స్ చాలా ఉంటాయి. ఫ్యాన్స్ అడిగితే ఎలాంటి ఫేవరేట్ విషయం అయినా చెప్పేస్తారు. కానీ పర్సనల్ గా బాగా దగ్గరైన విషయాలు చెప్పడానికి వెనకడతారు. కరెక్ట్ టైం వచ్చినప్పుడు చెబుతాం అంటూ ఆ సందర్బం నుండి దాటేస్తారు. కానీ మళ్లీ దొరక్కపోతారా అంటూ ఫ్యాన్స్ తో పాటు మీడియా వారు వెయిట్ చేస్తుంటారు. అంటే అలాంటి సమయం త్వరగా వస్తుందని చెప్పలేం కానీ ఖచ్చితంగా ఫేవరేట్ విషయాలు బయట పెట్టేందుకు ఓ టైం వస్తుంది. ఆ టైం వస్తే.. అదే సిట్యుయేషన్ డిమాండ్ చేస్తే చెప్పకమానరు.
తాజాగా అలాంటి సందర్బం ఎదుర్కొంది సౌత్ స్టార్ హీరోయిన్ సమంత. అమ్మడు తన పదకొండు సంవత్సరాల కెరీర్ లో కేవలం దక్షిణాది భాషల్లో మాత్రమే సినిమాలు చేసింది. అందులోను ఇంతవరకు కన్నడలో నటించలేదు. కానీ అన్ని భాషల్లో నటించే ఆలోచనలో ఉన్నట్లు మాత్రం సామ్ ఇదివరకే పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. అయితే అభిమానులు ఆశించినట్లుగానే సమంత త్వరలో బాలీవుడ్ లో అడుగుపెడుతోంది. అదికూడా సినిమాతో కాదు ఓ వెబ్ సిరీస్ తో.. 2019 మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ సక్సెస్ కావడంతో సెకండ్ సీసన్ తెరకెక్కించారు మేకర్స్. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్ తో సామ్ హిందీ ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది.
అయితే ఈ వెబ్ సిరీస్ జూన్ 4న నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా సమంత తాజాగా బాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూ అటెండ్ అయింది. అయితే వెబ్ సిరీస్ గురించి అడిగిన అన్ని ప్రశ్నలకు అమ్మడు సమాధానలు చెప్పేసింది. అలాగే ఇందులో ఆమె క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేసారని చెప్పింది. అలాగే ఈ సిరీస్ క్రేజ్ చూస్తుంటే ఇప్పుడే హిట్ కొట్టినట్లుగా ఉందని చెప్పింది. ఇదిలా ఉండగా.. సమంతను ఓ మీడియా వ్యక్తి.. బాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు కాబట్టి.. బాలీవుడ్ లో ఏ హీరోతో సినిమా చేయాలనీ ఉందని అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా సామ్.. వెంటనే రన్బీర్ కపూర్ పేరు చెప్పేసింది. బాలీవుడ్ లో రన్బీర్ అంటే చాలా ఇష్టమని చెప్పేసింది. అలాగే ఈ సిరీస్ లో మనోజ్ ప్లేస్ లో టాలీవుడ్ యాక్టర్ ఎవరు సూట్ అవతారని అడిగితే.. వెంటనే తన మామయ్య అక్కినేని నాగార్జున పేరు చెప్పింది సామ్. ప్రస్తుతం ఈ వయ్యారి రన్బీర్ నేమ్ చెప్పేసరికి బాలీవుడ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.