Begin typing your search above and press return to search.

కిల్లర్ సమంతా ఎప్పుడు వస్తుంది

By:  Tupaki Desk   |   21 Feb 2019 4:27 AM GMT
కిల్లర్ సమంతా ఎప్పుడు వస్తుంది
X
అక్కినేని కోడలయ్యి ఏడాది దాటినా అవకాశాలకు ఎలాంటి లోటు లేకుండా దూసుకుపోతున్న సమంతా డైరీ ఇంకో రెండేళ్ళ దాకా ఖాళీగా లేదు. మనం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని భర్త నాగ చైతన్యతో కలిసి నటించిన మజిలి షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావొచ్చింది. మరోపక్క కొరియన్ మూవీ ఆధారంగా నందిని రెడ్డి దర్శకత్వంలో మరో వెరైటీ మూవీ చేస్తున్న సాం గత ఏడాది పూర్తి చేసిన సినిమా మరొకటి ఉంది. అదే సూపర్ డీలక్స్. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ట్రాన్స్ జెండర్ గా వెరైటీ రోల్ పోషించిన ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యి నెలలు దాటింది.

ఫస్ట్ లుక్ ఇంతకు ముందే రిలీజ్ చేసారు కాని ఆ తర్వాత అప్ డేట్స్ ఆగిపోయాయి. ఇప్పుడు మరోసారి చిన్న కదలిక వచ్చింది. సమంతా ఇందులో ఎలా ఉండబోతోందో రివీల్ చేస్తూ ఓ కొత్త పోస్టర్ ని విడుదల చేయబోతున్నారు. దానికి సంబంధించిన సమాచారాన్నే సమంతా తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది విశ్వసనీయ సమాచారం మేరకు సమంతా ఇందులో సీరియల్ కిల్లర్ గా నటిస్తోందట. అంత అందమైన అమ్మాయి అలా హత్యలు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేదే కీలకమైన పాయింట్ కాబట్టి అదొక్కటి లీక్ చేయకుండా జాగ్రత్త పడింది టీం.

ఇప్పటిదాకా సున్నితమైన పాత్రల్లో చూస్తూ వచ్చిన సామ్ ని అలా మర్డర్లు చేసే రోల్ లో అభిమానులు డైజెస్ట్ చేసుకోగలరా. ఏమో కథ డిమాండ్ మేరకు అలా చేయాల్సి వచ్చిందేమో. ఏదో కారణం లేనిదే సమంతా ఇలాంటి పాత్రలు ఒప్పుకోదుగా. త్యాగరాజియన్ కుమారరాజా దర్శకత్వం వహించిన సూపర్ డీలక్స్ ని అదే పేరుతో తెలుగులో కూడా డబ్ చేయబోతున్నారు. ఇక్కడ ప్రమోషన్ కు కాస్త టైం పట్టేలా ఉంది. తన కెరీర్ లోనే డిఫరెంట్ పాత్ర వేసిన సమంతాను చూడాలని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయక తప్పేలా లేదు. మార్చ్ విడుదల ఉండే అవకాశాలు ఉన్నాయి