Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : సమంత సింపుల్‌ అండ్‌ సూపర్‌

By:  Tupaki Desk   |   13 Nov 2020 8:37 AM IST
ఫొటోటాక్‌ : సమంత సింపుల్‌ అండ్‌ సూపర్‌
X
టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ సమంత అక్కినేని కాస్ట్యూమ్స్‌ విషయంలో ఎప్పుడు కూడా విమర్శకుల ప్రశంసలు పొందుతూనే ఉంటుంది. ఈమె సందర్బానుసారంగా ధరించే కాస్ట్యూమ్స్‌ ఆకట్టుకుంటూ ఉంటాయి. ఈసారి చాలా కూల్‌ అండ్‌ సూపర్‌ కాంబినేషన్‌ లో సమంత కనిపించింది. ఎయిర్‌ పోర్ట్‌ లో సమంత ఇలా కెమెరా కన్నుకు చిక్కింది. బ్లాక్‌ పాయింట్‌ అండ్‌ టీషర్ట్‌ పై సింప్లీ సూపర్‌ డెనిమ్‌ లైట్‌ బ్లూ జాకెట్‌ లో సమంత అదిరిపోయింది. మ్యాచింగ్‌ నల్లని మాస్క్‌ ను కూడా సమంత ధరించింది. చేతిలో చిన్న క్యారీ బ్యాగ్‌ తో సమంత అలా నడిచి వస్తుంటే వావ్‌ అన్నట్లుగా ఉంది.

సమంత రెగ్యులర్‌ గా హైదరాబాద్‌.. చెన్నై ప్రయాణిస్తూనే ఉంటుంది. తాజాగా కూడా ఆమె తన జర్నీ కొనసాగించారు. ప్రస్తుతం సమంత సామ్‌ జామ్‌ ఆహా టాక్ షో తో బిజీగా ఉన్న సమంత త్వరలో కొత్త సినిమాను మొదలు పెట్టేందుకు కూడా చర్చలు జరుపుతోంది. మరో వైపు ఈమె 'ది ఫ్యామిలీ మెన్‌' వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 2 లో నటించింది. ఆ వెబ్‌ సిరీస్‌ విడుదలకు సిద్దం అవుతుంది. అమెజాన్‌ ద్వారా రాబోతున్న ఆ వెబ్‌ సిరీస్‌ లో పాకిస్తాన్‌ అమ్మాయిగా సమంత కనిపించబోతుంట. మరో వైపు తమిళంలో ఈమె కమిట్‌ అయిన ఒక సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో పట్టాలెక్కించే అవకాశం ఉంది అంటున్నారు.