Begin typing your search above and press return to search.

సమంత ఐటెం సాంగ్‌ నెం.1 గా నిలవడం పెద్ద విషయం.

By:  Tupaki Desk   |   27 Dec 2021 2:21 PM IST
సమంత ఐటెం సాంగ్‌ నెం.1 గా నిలవడం పెద్ద విషయం.
X
2020 సంవత్సరంలో యూట్యూబ్‌ మ్యూజిక్ విభాగంలో అల్లు అర్జున్‌ అల వైకుంఠపురంలో సినిమా టాప్ లో నిలిచింది. సినిమాలోని పలు పాటలు చాలా నెలల పాటు ట్రెండ్డింగ్‌ లోనే ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయి సింగర్స్ మరియు మ్యూజిక్ ఆల్బమ్స్ తో పోటీ పడ్డ అల వైకుంఠపురంలో మ్యూజిక్ ఆల్బం కు ఏమాత్రం తగ్గకుండా అల్లు అర్జున్ పుష్ప సినిమా మ్యూజిక్ ఆల్బం కూడా ఆహా అన్నట్లుగా యూట్యూబ్‌ లో రచ్చ చేస్తోంది.

భారీ ఎత్తున యూట్యూబ్‌ లో వ్యూస్ ను దక్కించుకుంటున్న పుష్ప పాటలు 2021 చివర్లో టాప్‌ 100 లో స్థానం దక్కించుకున్నాయి. ఈమద్యే వచ్చినా కూడా ఈ ఏడాది ఆరంభం నుండి వచ్చిన పాటలను మ్యూజిక్ ఆల్బం లను వెనక్కు నెట్టి పుష్ప టాప్ లో నిలిచాయి.

పుష్ప సినిమా లోని ఐటెం సాంగ్ ప్రస్తుతం గ్లోబల్‌ లోనే నెం.1 గా యూట్యూబ్ లో కొనసాగుతూ వస్తోంది. యూట్యూబ్‌ లో ఒక తెలుగు సాంగ్‌ నెం.1 స్థానంలో ఎక్కువ కాలం ఉండటం చాలా అరుదుగా జరుగుతుంది. పుష్ప ఐటెం సాంగ్‌ కు ఆ ఛాన్స్ దక్కింది. పుష్ప ఐటెం సాంగ్‌ లో సమంత నటించడంతో పాటు దేవి శ్రీ ప్రసాద్‌ చాలా ఆకట్టుకునే ట్యూన్ ను ఇవ్వడం.. పాడిన సింగర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా పాడటం వల్ల ఇప్పుడు టాప్‌ లో ఉంది.

తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ పాట సూపర్‌ హిట్ అయ్యింది. కేవలం పుష్ప ఐటెం సాంగ్‌ ఊ అంటావా ఊఊ అంటావా మావా పాట మాత్రమే కాకుండా శ్రీవల్లి మరియు సామి సామి పాటలు కూడా యూట్యూబ్‌ లో గ్లోబల్‌ స్థాయిలో టాప్‌ 100 జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

యూట్యూబ్ లో 100 పాపులర్‌ సాంగ్స్ జాబితాలో ఊ అంటావా ఊఊ అంటావా పాట నెం.1 గా నిలిచింది. శ్రీవల్లి పాట 22 వ స్థానంలో నిలిచింది. సామి సామి తమిళ వర్షన్‌ ఈ జాబితాలో 25 వ స్థానంలో నిలవడం విశేషం. ఊ అంటావా ఊఊ అంటావా హిందీ వర్షన్‌ కు 42వ స్థానం దక్కింది. సామీ సామీ తెలుగు వర్షన్ కు 51వ స్థానం దక్కింది. చివరగా సామి సామి తెలుగు లిరికల్‌ వీడియోకు 68 వ స్థానం దక్కింది.

మొత్తానికి పుష్ప కు సంబంధించిన పాటలే ఏకంగా ఆరు స్థానాలను దక్కించుకున్నాయి. సమంత ఐటెం సాంగ్‌ నెం.1 గా నిలవడం పెద్ద విషయం. దేవి శ్రీ ఐటెం సాంగ్‌ తెలుగు మరియు హిందీ వర్షన్ లు రెండు కూడా టాప్ 100 లో చోటు దక్కించుకున్నాయి. మొత్తానికి పుష్ప సినిమా విజయంలో ఈ పాటలు ఎంత కీలక పాత్ర పోషించాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.