Begin typing your search above and press return to search.

#సామ్ జామ్.. మ‌న్మ‌థుడి గాళ్ ఫ్రెండ్ ని దించేస్తున్నారు!

By:  Tupaki Desk   |   14 Dec 2020 5:26 PM IST
#సామ్ జామ్.. మ‌న్మ‌థుడి గాళ్ ఫ్రెండ్ ని దించేస్తున్నారు!
X
ఆహా-తెలుగు ఓటీటీకి `సామ్ జామ్` టాక్ షో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌ను పెంచింద‌న‌డంలో ఎలాంటి సందేహం అక్క‌ర్లేదు. ద‌క్షిణాదిన స‌మంత‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా బాస్ అర‌వింద్ ఎంపిక ను ప్ర‌శంసించి తీరాలి. సామ్ జామ్ లో స్టార్ల‌తో నిత్య‌నూత‌న కార్య‌క్ర‌మాలు హైలైట్ అవుతున్నాయి.

స‌మంత టాక్ ‌షో హోస్ట్ ‌గా వంద శాతం స‌క్సెస్ సాధిస్తున్నారు. పైగా ఎప్ప‌టిక‌ప్పుడు నిత్య‌నూత‌నంగా తనదైన‌ కొత్త అవతారంలో ఆక‌ట్టుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ షోలో మెగాస్టార్ చిరంజీవి- అల్లు అర్జున్ - విజయ్ దేవరకొండ- తమన్నా వంటి టాప్ టాలీవుడ్ తారలను ఆహ్వానించారు. చిరుతో ఎపిసోడ్ క్రిస్మ‌స్ కానుక‌గా ఈనెల 25న‌ స్ట్రీమింగ్ కానంది.

ఇక బ‌న్నీకి ఇంత‌కుముందు స‌మంత కొన్ని కానుక‌ల్ని పంపించిన సంగ‌తి తెలిసిందే. వాటికి సంబంధించిన ఫోటోల్ని బ‌న్ని సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేశారు. ఈసారి ఛాన్స్ ర‌కుల్ కి వ‌చ్చింది. అందాల ర‌కుల్ ప్రీత్ తాను ఆశ్చర్యకరమైన బహుమతులు పొందాన‌ని తెలిపారు. ‘సామ్ జామ్’ హోస్ట్ రకుల్ కు మోయిట్ & చాండన్ షాంపైన్ - ఐఫోన్ ఒక గూడీ బాక్స్ పువ్వులతో కూడిన బహుమతిని పంపారు. రకుల్ ఇన్ స్టాగ్రామ్ ‌లో ఈ గిఫ్ట్ హాంపర్ చిత్రాన్ని పంచుకున్నారు.

సమంత -రకుల్ ప్రీత్ ఇద్దరి మ‌ధ్యా చిర‌కాల స్నేహం అనుబంధం గురించి తెలిసిందే. ఆ ఇద్ద‌రూ క‌లిసి మెలిసి ఉన్న ఫోటోలు ఇంత‌కుముందు వైర‌ల్ అయ్యాయి. అలాగే అక్కినేని కాంపౌండ్ లో `మ‌న్మ‌‌థుడు 2`లో ర‌కుల్ న‌టించింది. ఇటీవ‌లే ర‌కుల్ పై అన్న‌పూర్ణ స్టూడియోస్ సెట్లో సామ్ జామ్ కార్య‌క్ర‌మాన్ని చిత్రీక‌రించార‌న్న సంగ‌తి తాజాగా రివీలైంది. అయితే ఇది టెలీకాస్ట్ కావ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుందిట‌. ఆహా ద్వారా ర‌కుల్ నుంచి ఎలాంటి టాప్ సీక్రెట్స్ ని స‌మంత లీక్ చేయిస్తారో చూడాలి.