Begin typing your search above and press return to search.

మిలియన్ మార్క్.. సినిమాలు తగ్గినా సమంత క్రేజ్‌ తగ్గలేదు

By:  Tupaki Desk   |   28 May 2020 12:30 AM GMT
మిలియన్ మార్క్.. సినిమాలు తగ్గినా సమంత క్రేజ్‌ తగ్గలేదు
X
గత రెండేళ్లుగా సమంత సినిమాల సంఖ్య చాలా వరకు తగ్గింది. కెరీర్‌ ఆరంభంలో చేసినంత స్పీడ్‌ గా సినిమాలు చేయడం లేదు. గత ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఈ ఏడాది కనీసం ఒక్క సినిమాను కూడా విడుదల చేయడం లేదు. కమర్షియల్‌ సినిమాలకు దూరంగా ఉన్న సమంత ఎక్కువగా లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలకు మాత్రమే ఓకే చెబుతూ వస్తోంది. ఒక వైపు సినిమాల సంఖ్య తగ్గించినా మరో వైపు ఈమె సోషల్‌ మీడియా ఫాలోవర్స్‌ సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది.

సౌత్‌ స్టార్స్‌ లో అతి కొద్ది మందికి మాత్రమే ఉన్న 10 మిలియన్స్‌ ఫాలోవర్స్‌ సంఖ్యను సమంత చేరింది. ఇన్‌ స్టాగ్రామ్‌ లో కోటి మంది ఫాలోవర్స్‌ ను దక్కించుకున్న సమంత ఆ సంఖ్యను మరింతగా పెంచుకుంటూ పోతూనే ఉంది. ఫేస్‌ బుక్‌.. ట్విట్టర్‌ లలో కంటే ఇన్‌ స్టా లో అధికంగా యాక్టివ్‌ గా ఉంటున్న సమంత ఫాలోవర్స్‌ ఈమద్య కాలంలో అధికంగా పెరిగారు.

తన సినిమాల విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను ఫొటోలను వీడియోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా నాగచైతన్యతో ఈ అమ్మడు ఉన్న రొమాంటిక్‌ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతూనే ఉంటాయి. భర్తతో తీసుకున్న ఫొటోలు ఎక్కువగా షేర్‌ చేస్తున్న సమంత ప్రతి పోస్ట్‌ కు భారీగా లైక్స్‌ కామెంట్స్‌ పొందుతూ ఉంటుంది. తనకు 10 మిలియన్‌ ల ఫాలోవర్స్‌ వచ్చిన సందర్బంగా పది స్వచ్చంద సంస్థలకు తనవంతు సహకారం అందిస్తానంటూ సమంత ప్రకటించింది.