Begin typing your search above and press return to search.

హిందీ యాస బాగోదు అంటూ ఎస్కేప్!

By:  Tupaki Desk   |   16 Dec 2019 5:30 PM GMT
హిందీ యాస బాగోదు అంటూ ఎస్కేప్!
X
త‌న‌దైన అందం.. ప్ర‌తిభ‌తో సౌత్ ని ఏల్తోంది అందాల స‌మంత‌. ఇప్పుడు ఉత్త‌రాదికి ట్రీటివ్వ‌బోతోంది. అది కూడా ఓ వెబ్ సిరీస్ తో హిందీ ప్రేక్ష‌కుల ముందుకు వెళుతోంది. ఇప్ప‌టికే బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకున్న ఫ్యామిలీమేన్ వెబ్ సిరీస్ రెండో సీజ‌న్ లో స‌మంత అద్భుత‌మైన పాత్ర‌తో ర‌క్తి క‌ట్టించ‌బోతోంది. అక్కినేని కోడ‌లు ఈ సిరీస్ లో విల‌న్ గా క‌నిపించ‌నుంద‌న్న స‌మాచారం ఇదివ‌ర‌కూ లీకైన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం ఫ్యామిలీమేన్ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం ముంబైలో ఉన్న స‌మంత అక్కడ ఓ ఫ్యాష‌న్ ఈవెంట్ లో త‌ళుక్కుమంది. హిందీ ఈవెంట్ కి త‌గ్గ‌ట్టుగానే అల్ట్రా మోడ్ర‌న్ లుక్ లో ఈ వేడుక‌కు ఎటెండైంది. థై స్లిట్ డిజైన‌ర్ డ్రెస్ లో సామ్ ఇచ్చిన ట్రీట్ ఆ వేదిక వ‌ద్ద‌ క‌న్నుల‌పండుగ చేసింద‌నే చెప్పాలి. ఈ వేదిక‌పై స‌మంత‌కు ముంబై మీడియా నుంచి ప‌లు ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి.

సామ్ త‌న‌కు తెలిసీ తెలియ‌ని హిందీ మాట్లాడినా.. అక్క‌డివారి హృదయాలను గెలుచుకుంటుంది. త‌న‌దైన యాస‌తో క‌ట్ షాట్ గా మాట్లాడి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. ఫ్యామిలీమేన్ సిరీస్ లో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది అని సామ్ మీడియాకు తెలిపింది. హిందీ స‌రిగా మాట్లాడ‌లేక‌పోతున్నందుకు నన్ను క్షమించండి అంటూనే.... నాకు హిందీ తెలుసు.. కానీ నేను దక్షిణ భారతీయురాలిని కాబట్టి మాట్లాడను. నాకు భాష తెలిసినా యాస ప‌ర‌మైన స‌మ‌స్య ఉంది`` అంటూ ఎస్కేప్ అయిపోయింది. స‌మంత ప్ర‌స్తుతం 96 రీమేక్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని త‌దుప‌రి వెబ్ సిరీస్ పై దృష్టి సారించిన సంగ‌తి తెలిసిందే.