Begin typing your search above and press return to search.

అక్కినేని కోడ‌లు మైండ్ బ్లోవింగ్ డీల్

By:  Tupaki Desk   |   7 May 2020 9:45 AM IST
అక్కినేని కోడ‌లు మైండ్ బ్లోవింగ్ డీల్
X
పెళ్ల‌య్యాక హీరోయిన్ గా రాణించ‌డం అన్న‌ది అరుదైన విష‌య‌మే. అదో బిగ్ క్శశ్చ‌న్ మార్క్. చాలా మంది కోడ‌ళ్ల‌కు అది సాధ్య‌ప‌డ‌లేదు. కొంద‌రు నాయిక‌లు మొండిప‌ట్టు ప‌ట్టి న‌ట వృత్తిని కొన‌సాగించ‌‌డం అన్న‌ది ఫ్యామిలీ బ్రేక‌ప్ కి కూడా కార‌ణ‌మైంది. అయితే అలా కాకుండా .. గ్లామ‌ర్ ఎలివేష‌న్ తో ప‌ని లేకుండా.. సాంప్ర‌దాయ బ‌ద్ధంగా లేడీ ఓరియెంటెడ్ క‌థాంశాల్ని ఎంచుకుని సీరియ‌స్ థ్రిల్ల‌ర్ డ్రామాల్లో న‌టించడం ద్వారా కొంద‌రు నెట్టుకొస్తున్నారు. అయితే ఈ పంథాలో వెళుతూనే వీలున్నంత‌వ‌ర‌కూ గ్లామ‌ర్ ఎలివేష‌న్ చేస్తూ ఎంతో తెలివైన ఎంపిక‌ల‌తో అక్కినేని కోడ‌లు స‌మంత‌ సాగిస్తున్న జ‌ర్నీ స‌ర్వ‌త్రా హాట్ టాపిక్ గా మారుతోంది.

సామ్ న‌టించిన గ‌త చిత్రాల్ని ప‌రిశీలిస్తే ఓ బేబి- యూట‌ర్న్ లాంటివి ఈ త‌ర‌హానే. ప్ర‌యోగాత్మ‌క క‌థాంశాల్ని ఎంచుకుని లేడీ ఓరియెంటెడ్ కి స్టిక్ అయితే మంచి ఫ‌లితం వ‌స్తుంద‌ని ఓ బేబి ప్రూవ్ చేసింది. భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో క‌లిసి న‌టించిన మ‌జిలీ మ‌ర‌పురాని స‌క్సెస్ నివ్వ‌డం త‌న‌లో కాన్ఫిడెన్స్ ని బూస్ట‌ప్ చేసింది. అయితే వీట‌న్నిటికీ డిఫ‌రెంటుగా ఆలోచిస్తూనే అటు త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో వైవిధ్య‌మైన పాత్ర‌ల్ని ఎంపిక చేసుకుని షాకిచ్చారు స‌మంత‌. అక్క‌డ సేతుప‌తి స‌ర‌స‌న చేసిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఆ త‌ర‌హానే.

ఇక‌పోతే ఇప్ప‌టికిప్పుడు సామ్ రెండు చిత్రాల్లో న‌టిస్తున్నార‌ని వార్తలొచ్చాయి. విజ‌య్ సేతుప‌తి - విఘ్నేష్ శివ‌న్ కాంబినేష‌న్ మూవీ.. అలాగే గేమ్ ఓవర్ ద‌ర్శ‌కుడు అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ తో వేరొక మూవీకి సంత‌కం చేశార‌న్న ప్ర‌చారం సాగింది. అయితే ఆ త‌ర్వాత క‌రోనా లాక్ డౌన్ ప‌రిణామాల‌తో ఆ సినిమాల నుంచి సామ్ త‌ప్పుకుంద‌న్న ప్ర‌చారం కూడా సాగిపోయింది. అదే నిజ‌మైతే ప్ర‌స్తుతం సామ్ ఖాళీయేనా? అంటే.. ఇక్క‌డ తెలుగులో ప‌లు స్క్రిప్టులు త‌న కోసం రెడీ అవుతున్నాయి. వీటితో పాటే సోనీపిక్చ‌ర్స్ లాంటి బిగ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ తో ఓ భారీ ఒప్పందం కుదుర్చుకుంద‌న్న ప్ర‌చారం తాజాగా తెర‌పైకొచ్చింది. ఇది బ‌హుభాషా చిత్రం. తెలుగు-త‌మిళం-క‌న్న‌డ‌-మ‌ల‌యాళం- హిందీలో తెర‌కెక్క‌నుంద‌ట‌. ఒక ర‌కంగా పాన్ ఇండియా చిత్రం అన్న ప్ర‌చారం సాగుతోంది. మ‌రోవైపు ఓటీటీ ప్రాజెక్ట్ నా అన్న దానిపైనా స‌రైన క్లారిటీ రావాల్సి ఉంది. ప్రాజెక్టుకు సంబంధించి ఇత‌ర‌త్రా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. అమెజాన్ ప్రైమ్ లో క్రేజీ సిరీస్ `ఫ్యామిలీ మ్యాన్ 2` లో న‌టించిన సామ్ కి ఇది మ‌రో భారీ డీల్ అన‌డంలో సందేహ‌మేం లేదు. అయితే దీనికి సంబంధించిన అధికారిక వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంటుంది.