Begin typing your search above and press return to search.

సమంత మరీ అంత వీక్ నా..?

By:  Tupaki Desk   |   9 Dec 2021 9:30 AM IST
సమంత మరీ అంత వీక్ నా..?
X
అగ్ర కథానాయిక సమంత తన భర్త భర్త అక్కినేని నాగచైతన్య తో విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ లో ఆలోచింపజేసే కొటేషన్స్ - భావోద్వేగ పోస్టులు పెడుతూ వస్తోంది. అయితే ఇటీవల ఫిల్మ్‌ ఫేర్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో.. విడాకులు మరియ తన వ్యక్తిగత జీవితం గురించి సమంత తొలిసారిగా మాట్లాడింది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ ట్రోల్స్ వస్తున్న విషయాన్ని ప్రస్తావించింది.

'ఏదైనా సమస్య ఎదురైతే దాన్ని ముందు మనం అర్థం చేసుకోవాలి. సమస్యని అంగీకరించాలి. అప్పుడే జయించడానికి మార్గం దొరుకుతుంది. లేదంటే అంతం లేని యుద్ధం చేస్తున్నట్టే' అని సమంత అభిప్రాయ పడింది. తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలతో పోరాడుతూ.. తానింత స్ట్రాంగ్ ఉన్నానంటే ఆశ్చర్యంగా ఉందని తెలిపింది.

''నేను చాలా బలహీనురాలిని అనుకునేదాన్ని. విడిపోయిన తర్వాత కృంగిపోయి చనిపోతానని అనుకున్నాను. కానీ ఇంత బలంగా ఉండగలనని అనుకోలేదు. ఈరోజు ఇలా ఉన్నానంటే నాకు చాలా గర్వంగా ఉంది.. ఇలా ఎలా ఉన్నానో నాకే తెలియడం లేదు'' అని సమంత చెప్పుకొచ్చింది. అదే సమయంలో

బ్రేకప్ అనేది ఎవరి జీవితంలో అయినా కఠినమైనదే. బలంగా ఉన్నా లేదా బలహీనంగా ఉన్నా అది ఒకరినొకరిని బాధిస్తుంది. కానీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోకపోవడం వీక్ నెస్ అని చెబుతుంటారు. మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఆమె చాలా వీక్ అని అర్థం అవుతోంది.

అందుకే ఒక సెలబ్రిటీ మరియు సూపర్ స్టార్ అయ్యుండి కూడా తన వ్యక్తిగత విషయాలను ఎమోషనల్ గా బయట పెట్టేసింది. జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్. మంచో చెడో అన్నింటినీ యాక్సెప్ట్ చేయాలి. మన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటూ స్ట్రాంగ్ గా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

ఇప్పటికైతే సమంత తనను తాను బలమైన మహిళగా చెప్పుకుంటోంది. కెరీర్ మీద దృష్టి పెట్టి వరుసగా సినిమాలు కమిట్ అవుతూ నార్మల్ గా అవడానికి ట్రై చేస్తోంది. మునుముందు సామ్ మరింత స్ట్రాంగ్ గా అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు చైతన్య కూడా కెరీర్ మీద ఫోకస్ పెట్టి తన పని తాను చూసుకుంటున్నారు. తన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడా మాట్లాడకుండా.. సైలెంటుగానే కఠినమైన రోజులను ఎదుర్కొంటూ స్ట్రాంగ్ గా నిలబడ్డాడు.