Begin typing your search above and press return to search.

వీడియో : రయ్‌ రయ్‌.. సమంత రైడింగ్‌

By:  Tupaki Desk   |   27 Sept 2021 3:01 PM IST
వీడియో : రయ్‌ రయ్‌.. సమంత రైడింగ్‌
X
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఈమద్య కాలంలో ఎక్కువగా మీడియాలో నిలిచింది. నాగచైతన్యతో ఈమె కలిసి ఉండటం లేదు అంటూ అన్ని మీడియాలు కూడా కోడై కూస్తున్నాయి. ఆ విషయాన్ని ఆమెనే ప్రశ్నించేందుకు మీడియా ప్రయత్నిస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలోనే జర్నలిస్ట్‌ ను బుద్ది ఉందా అంటూ తీవ్ర వ్యాఖ్యలతో అసహనం వ్యక్తం చేసింది. ఇన్ని రోజులు మీడియాలో వస్తున్న వార్తలను చూస్తూ ఊరుకోవడం ఏంటీ.. పుకార్లే.. అబద్దాలే అయితే ఒక్క ట్వీట్‌ తో వాటన్నింటిని కొట్టి వేయవచ్చు కదా అంటూ కొందరు అభిమానులు అడుగుతున్నారు. జనాలు మీడియాలో ఇంత హడావుడి జరుగుతుంటే సమంత మాత్రం తాపీగా కుక్క పిల్లలతో ఆడుకుంటూ.. తన స్నేహితులతో పార్టీలకు అటెండ్‌ అవుతూ ఎంజాయ్ చేస్తుంది.

ఇటీవలే పలువురు హీరోయిన్స్ తో చెన్నైలో ఒక పార్టీలో పాల్గొంది. రెగ్యులర్ గా ఆమె చెన్నైలో పార్టీలు పబ్ లు అంటూ తిరుగుతుంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా తాజాగా సైక్లింగ్‌ కు వెళ్లి అలా కొద్ది సమయం సరదాగా సన్నిహితులతో గడిపింది. వర్షంలో సైక్లింగ్‌ అంటూ ఇన్ స్టా గ్రామ్‌ లో సమంత ఈ వీడియోను షేర్‌ చేసింది. ఆమె ప్రస్తుతం నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమె ఏం చేసినా కూడా లోతుగా విశ్లేషిస్తున్న వారు ఉన్నారు. ఇటీవల పార్టీ లో పాల్గొన్న పిక్స్ కు చైతూ తో విడిపోయి పార్టీలు చేసుకుంటున్నావా అంటూ కొందరు కాస్త ఘాటుగానే కామెంట్స్‌ చేయడం జరిగింది. మరి కొందరు మరో రకంగా ఆమెను టార్గెట్స్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. ఎవరు ఎంతగా మాట్లాడుతున్నా సమంత మాత్రం తన పని తాను అన్నట్లుగా ముందుకు వెళ్తుంది.

ఫిజిక్ విషయంలో చాలా శ్రద చూపించే సమంత వర్షంలో సరదాగా సన్నిహితులతో సైక్లింగ్‌ కు వెళ్లిన వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సమంత సినిమాల విషయానికి వస్తే శాకుంతలం విడుదలకు సిద్దం అవుతోంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాను మంచి సమయం చూసి విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. వచ్చే ఏడాదికి ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తమిళంలో విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో నయన్‌ మరియు విజయ్ సేతుపతితో కలిసి నటిస్తున్న సినిమా కూడా వచ్చే ఏడాదిలో విడుదల కాబోతున్నాయి. సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్ ల్లో కూడా ఆఫర్లు వస్తున్నాయి. మొత్తానికి సమంత బిజీ బిజీగానే ఉంది. ఇదే సమయంలో ఆమె చైతూ విషయంలో కూడా స్పందిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు.