Begin typing your search above and press return to search.

గుండెల్లో భారాన్ని స‌మంత అలా దించుకుంటుందా!

By:  Tupaki Desk   |   20 Oct 2021 12:22 PM IST
గుండెల్లో భారాన్ని స‌మంత అలా దించుకుంటుందా!
X
నాగ‌చైత‌న్య‌-స‌మంత జంట‌ విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన‌ సంగ‌తి తెలిసిందే. సంసార జీవ‌నంలో క‌ల‌త‌లు స‌రే.. కానీ త‌ప్పెవ‌రిది? అంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్ న‌డుస్తోంది. అంతా స‌మంత‌నే ఆడిపోసుకోవ‌డంపై విమ‌ర్శ‌లొచ్చాయి. ఇక్క‌డ త‌ప్పు ఎవ‌రిది? అన్న‌ది ప‌క్క‌న‌పెడితే వ‌న్ సైడ్ సోషల్ మీడియా జ‌నం స‌మంతనే టార్గెట్ చేసిన‌ట్లు క‌నిపించింది. చైత‌న్య మౌనంగా ఉండిపోవ‌డం..స‌మంత అప్ప‌టికే ఎప్ప‌టిలాగే సంతోషంగా ఉండ‌టం ..విహార‌యాత్ర‌ల‌కు షికార్లు చేయ‌డం తో సోష‌ల్ మీడియాలో ప‌రోక్షంగా కామెంట్లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ఇవ‌న్నీ చూసినా స‌మంత‌లో ఇసుమొత్తు బాధ అయినా క‌నిపించలేద‌ని నెటిజ‌నులు ఎటాక్ చేసారు. వీటిపై స‌మంత ఏనాడు స్పందించ‌నేలేదు. చూసి చూడ‌న‌ట్లే వ‌దిలిపెట్టేసింది.

అయితే త‌న మ‌న‌సుకు త‌గిలిన గాయం మానాలంటే ఏం చేయాలో అన్నీ చేస్తోంది స‌మంత‌. ప్ర‌స్తుతం కెరీర్ పైనే కాన్సంట్రేట్ చేసి ముందుకెళుతోంది. హైద‌రాబాద్ లోనే ఉంటోంది. వెబ్ సిరీస్ లు.. సినిమాల కోసం ముంబై కి వెళుతున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఏదైనా త‌గిలిన గాయం మాన‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. కాబ‌ట్టి ఈలోపు ఆ గాయ‌న్ని వీలైనంత త్వ‌ర‌గా త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయాలి. ప్ర‌స్తుతం స‌మంత చేస్తోన్న ప‌నులు చూస్తుంటే అదే అనిపిస్తోంది. స‌మంత కూడా ఈ విష‌యాన్ని ప్రాక్టిక‌ల్ గా చెప్ప‌క‌నే చెప్పింది. స‌మంత త‌న స్నేహితురాలు శిల్పారెడ్డి కుటుంబంతోనే ఎక్కువ స‌మ‌యం గడుపుతోంది. కాల‌క్షేపంగా అక్క‌డే ప్లాన్ చేసుకుంది. వాళ్ల‌తో క‌లిసి ఆటాపాట‌తో కాల‌క్షేపం చేయ‌డాన్ని హ్యాబిట్ గా మార్చుకుంది.

ఈ క్ర‌మంలో ట‌గ్ ఆఫ్ వార్ ఆడుతోన్న వీడియోని కూడా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. `బ్యూటీఫుల్.. క్రేజీ..ఫ‌న్..వీడ‌దీయ‌ని వారం అంద‌రితో బెస్ట్ గా గ‌డిచింద‌ని` ఓ క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. `ఐకెన్ స్టిల్ లాఫ్.. విల్ స‌ర్వై` అని పోస్ట్ చేసింది. దీన్ని బ‌ట్టి నేను ఏమాత్రం బాధ‌ప‌డ‌లేదు. సంతోషంగా ఉన్నాను..నా జీవితం నాది..నా బ్ర‌త‌కు నేను బ్ర‌త‌క‌గ‌ల‌ను అనే అర్ధం వ‌చ్చేలా కామెంట్ చేసింది. ప్ర‌స్తుతం స‌మంత గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో లేడీ ఓరియేంటెడ్ చిత్రం `శాకుంత‌లం`లో న‌టిస్తోంది. ఇటీవ‌లే షూటింగ్ కూడా పూర్తిచేసింది. అలాగే లైన్ లో ఉన్న ప్రాజెక్ట్ ల్ని వీలైంత‌న త్వ‌ర‌గా సెట్స్ పైకి తీసుకెళ్లాల‌ని ద‌ర్శ‌క‌ నిర్మాత‌ల్ని కోరుతోందిట‌. వృత్తిగ‌తంగా బిజీ అవ్వ‌డం తో పాటు స్నేహితుల‌తో క‌లాక్షేపం చేయ‌డం వ‌ల్ల ఒత్తిడిని అధిగ‌మించ‌వ‌చ్చ‌ని స‌మంత ప్రూవ్ చేస్తోంది.