Begin typing your search above and press return to search.

ఆ ముక్కుపుడ‌క‌తో మ‌తులు చెడ‌గొట్టిన సామ్

By:  Tupaki Desk   |   3 Sept 2021 8:00 PM IST
ఆ ముక్కుపుడ‌క‌తో మ‌తులు చెడ‌గొట్టిన సామ్
X
అక్కినేని కోడ‌లు స‌మంత కొద్ది రోజులుగా వెబ్ మీడియాలో సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. త‌న పేరు నుంచి `అక్కినేని` తొల‌గించి సంచ‌ల‌నానికి తెరలేపింది. నాటి నుంచి అభిమానుల్లో ర‌క‌ర‌కాల సందేహాలు .. స‌మాధానం లేని ప్ర‌శ్న‌లు... భ‌ర్త‌ నాగ‌చైత‌న్య‌తో స‌మంత క‌ల‌త‌లు స్టార్ట‌య్యాయ‌ని క‌థ‌నాలు తెర‌పైకి వ‌చ్చాయి. వీట‌న్నింటి న‌డుమ ఫ్యామిలీకి దూరంగా ఉంటోంద‌న్న మీడియా క‌థ‌నాలు అంత‌కంత‌కు వేడెక్కిస్తున్నాయి. వాటికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడుతుంది? అంటూ అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ కొన‌సాగుతోంది. ఇంత‌లోనే మీడియా క‌థ‌నాల‌పై సామ్ వ్యంగ్యంగా స్పందిస్తూ ఒక ఫోటోని షేర్ చేసింది. అందులో కుక్క‌లు బౌబౌమంటాయి.. మేము మామూలుగానే ఉంటాం! అనే అర్థం స్ఫురించింది. ఆ విష‌యాలు ప‌క్క‌న‌బెడితే...

స‌మంత ఫ్యాష‌న్ ఐక‌న్ గా త‌నదైన ముద్ర వేస్తూ ఇటీవ‌ల హాట్ టాపిక్ గా మారుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త పోటోషూట్స్ తో స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా క‌నిపించ‌డానికి స‌మంత ఇష్ట‌ప‌డుతుంది. స్టైల్ ఐక‌న్ త‌ర‌హా ఆల్ట్రా మోడ్ర‌న్ లుక్స్ లో క‌ట్టిప‌డేస్తుంది. తాజాగా సామ్ మ‌రో కొత్త లుక్ తో అభిమానుల్లోకి దూసుకొచ్చింది. తాజా లుక్ లో ఎంతో ఆకర్ష‌ణీయంగా కనిపిస్తుంది. పింక్ లో మిల మిలా మెరిసిపోతున్న డిజైన‌ర్ దుస్తుల్లో స‌మంత ఎంతో బ్యూటిఫుల్ గా క‌నిపిస్తోంది. ఈ డ్రెస్ లో ర‌క‌ర‌కాల భంగీమ‌ల్లో ఫోజులిచ్చి ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా ఆ ముక్కుకి మ‌క్కెర ఎంతో స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. చెవుల‌కి జూకాలు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తున్నాయి. ఆ అంద‌మైన కురుల‌ను ఒకే చోట చేర్చి సిగ ముడి వేసిన తీరు డిజైన‌ర్ మేక‌ప్ ఆక‌ట్టుకున్నాయి.

ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. చాలా గ్యాప్ త‌ర్వాత స‌మంత కొత్త ఫోటో షూట్ అభిమానుల కంట ప‌డ‌టంతో చిల్ అవుతున్నారు. ఇక స‌మంత సినిమాల విష‌యానికి వ‌స్తే గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో`శాకుంతలం`లో న‌టిస్తోంది. ఇది లేడీ ఓరియేంటెడ్ చిత్రం. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతోంది. ఈ చిత్రం మిన‌హా తెలుగులో మ‌రో సినిమాకి క‌మిట్ అవ్వ‌లేదు. అలాగే కోలీవుడ్ లో సేతుప‌తి స‌ర‌స‌న ఓ చిత్రంలోనూ న‌టిస్తోంది.