Begin typing your search above and press return to search.

ట్రెండ్ సెట్ చేయడంలో అక్కినేని కోడ‌లి త‌ర్వాతే

By:  Tupaki Desk   |   15 Aug 2020 2:20 PM IST
ట్రెండ్ సెట్ చేయడంలో అక్కినేని కోడ‌లి త‌ర్వాతే
X
సమంత అక్కినేని టాలీవుడ్ లో దశాబ్దం కెరీర్ ని సునాయాసంగా న‌డిపించేసిన సంగ‌తి తెలిసిందే. స్టార్ హీరోయిన్ గా .. సామాజిక సేవికురాలిగా.. ఫ్యాష‌నిస్టాగా ఈ పోటీప్ర‌పంచంలో త‌న‌దైన ముద్ర‌ను వేశారు. ప్ర‌స్తుతం అక్కినేని కోడ‌లిగా ప్ర‌మోటైన సామ్ స‌రికొత్త ఎంపిక‌ల‌తో నూత‌న ఒర‌వ‌డితో స‌త్తా చాటుతోంది.

ఇటీవ‌ల వ‌రుస‌గా అసాధారణ పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సామ్ అద్భుతమైన నటిగానే కాకుండా ఫ్యాష‌న్ ప‌రంగానూ ఎంతో ప్రసిద్ది చెందింది. ఇక ఫ్యాష‌న్స్ అండ్ స్టైలింగ్ విష‌యంలో స‌మంత‌ను ఆరాధించే ప్ర‌త్యేక అభిమానులు ఉన్నారు. ఫ్యాషన్ - ఫిట్‌నెస్ విషయానికి వస్తే సమంతా అక్కినేని వెనుతిరిగి చూసిందే లేదు. స్టైల్ ఐకాన్‌ గా అభిమానుల గుండెల్లో నిలిచింది.

ఇటీవ‌ల క‌జిన్ రానా పెళ్లి వేడుక‌లో సమంత అక్కినేని డిజైన‌ర్ లుక్ హాట్ టాపిక్ అయిన సంగ‌తి తెలిసిందే. మామిడి పసుపు ఆకుపచ్చ రంగు సూట్ లో అద‌ర‌గొట్టింది. త‌న ఎంపిక‌పై ప్ర‌త్యేకించి డిబేట్ న‌డిచింది. విఠ‌ల్ దాస్ సీత‌ల్ జావేరి డిజైన‌ర్ లుక్ అది.

సామ్ స్టైలింగ్ లో ఇప్ప‌టివ‌ర‌కూ టాప్ 5 ఫోటోషూట్ల‌ను ప‌రిశీలిస్తే.. రానా పెళ్లిలో లుక్ నంబ‌ర్ వ‌న్ అనే చెప్పాలి. ఆ త‌ర్వాత ప‌లుమార్లు ప‌లు ఈవెంట్ల‌లో స‌మంత లుక్ కి సంబంధించిన ఫోటోలు అంతే ఇదిగా సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ అయ్యాయి.

మజిలి స‌మ‌యంలో ఓసారి నీలిరంగు సీక్విన్స్ దుస్తులలో సామ్ అబ్బురపరిచింది. కాక్ ట‌యిల్ లుక్‌..ఇద‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. `ఓ బేబీ` సక్సెస్ మీట్ లో ప్రతిమా జుకాల్కర్ చేత హస్తకళా సీషెల్ చెవిపోగుకు స‌రిప‌డే డిజైన‌ర్ డ్రెస్ ని అనామిక ఖన్నా డిజైన్ చేసిన‌ది ఎంపిక చేసుకుంది. ఆ డ్రెస్ లో ఉబెర్-స్టైలిష్ గా కనిపించింది.

సమంతా ఇటీవల తన త్రోబాక్ లుక్స్ ‌ను టైలర్డ్ బ్లేజర్ ‌త‌ర‌హాలో చార‌ల‌ ప్యాంటు తో క‌నిపించి షాకిచ్చింది. త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ `సూపర్ డీలక్స్` మూవీ ప్ర‌మోష‌న్స్ లో ఓ స్పెష‌ల్ లుక్ అంత‌ర్జాలంలో అంతే వైర‌ల్ అయ్యింది. సమంత అక్కినేని రెడ్ కార్పెట్ ఈవెంట్లో మెరిసే హై స్లిట్ కట్ గౌనులో మెరిపించిన సంద‌ర్భాలు ఉన్నాయి. స్టైల్ ఐక‌న్ గా సామ్ కి ఓ రేంజుంద‌నే చెప్పాలి. త‌దుప‌రి సామ్ నిర్మాత‌గా మార‌నుంది. ఆ క్ర‌మంలోనే త‌న డిజైన‌ర్ లుక్ మారుతుందేమో చూడాలి.