Begin typing your search above and press return to search.

నేను చాలా చేశాను కాని సెక్సీగా కనిపించడం చాలా కష్టం : సమంత

By:  Tupaki Desk   |   21 Dec 2021 5:17 AM GMT
నేను చాలా చేశాను కాని సెక్సీగా కనిపించడం చాలా కష్టం : సమంత
X
అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా లో ఉన్న సమంత ఐటెం సాంగ్‌ గురించి సినిమా విడుదలకు ముందు విడుదల తర్వాత చాలా చర్చ జరుగుతోంది. ఆ పాటలో ఉన్న లిరిక్స్ ను కొందరు తప్పుబడుతుంటే.. కొందరు సమంత స్కిన్‌ షో ను తప్పుబడుతున్నారు. ఇదే సమయంలో దేవి శ్రీ ప్రసాద్‌ ఐటెం సాంగ్స్ అన్ని కూడా భక్తి పాటల ట్యూన్స్ అన్నట్లుగా మాట్లాడటంతో ఈ పాట మరింతగా వార్తల్లో నిలిచింది. ఈ పాట గురించి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్‌ లు.. రీల్స్.. కామెంట్స్ వస్తున్నాయి. వాటిలో కొన్నింటికి ఈమోజీలతో స్పందించిన సమంత మొదటి సారి తాను పాట గురించి స్పందించింది.

ఇన్‌ స్టాగ్రామ్ లో పుష్ప లోని తన ఐటెం సాంగ్‌ స్టిల్‌ ను షేర్ చేసి... ఇప్పటి వరకు నేను చాలా మంచి పాత్రలు చేశాను.. చెడ్డ పాత్రల్లో నటించాను... నేను ఫన్నీ పాత్రలు చేశాను.. సీరియస్ గా ఉన్న పాత్రలు చేశాను... నేను ఒక షో కు హోస్ట్‌ గా కూడా చేశాను.. నును ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా ప్రేక్షకులకు కనిపించాను. వాటన్నింటి కోసం నేను చాలానే కష్టపడ్డాను. కాని ఇలా సెక్సీగా కనిపించడం మాత్రం చాలా కష్టం... నెక్ట్‌ లెవల్ హార్డ్‌ వర్క్ మరియు కష్టం అన్నట్లుగా సమంత పోస్ట్‌ పెట్టింది. ఈ పాటకు వస్తున్న రెస్పాన్స్ కు ఆమె కృతజ్ఞతలు తెలియజేసింది. సినిమా గురించి మాట్లాడుకున్న ప్రతి సారి హీరో గురించి ఆయన యాక్షన్‌ గురించి జనాలు ఎంతలా అయితే మాట్లాడుతున్నారో అంతలా సమంత ఐటెం సాంగ్ గురించి కూడా మాట్లాడుతున్నారు అనడంలో సందేహం లేదు.

సమంత పుష్ప లో ఐటెం సాంగ్ చేసిన నేపథ్యంలో ముందు ముందు ఆమె నుండి మరిన్ని ఐటెం నెంబర్స్ ను ఆశించవచ్చు అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆమె అభిమానులు కూడా ఐటెం సాంగ్స్ చేయడంను తప్పుబడ్డట్టడం లేదు. ఈమద్య కాలంలో బాలీవుడ్‌ కు చెందిన చాలా మంది స్టార్‌ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేసి ఆకట్టుకున్న విషయం తెల్సిందే. అందుకే సమంత హీరోయిన్ గా కంటిన్యూగా సినిమాలు చేస్తూ ఐటెం సాంగ్స్ కూడా చేస్తే చూడాలని ఉందని అభిమానులు స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ఇక సమంత సినిమా ల విషయానికి వస్తే తెలుగు లో శాకుంతలం సినిమాను చేసింది. ఆ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ జరుపుకుంటోంది.

వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా విడుదల అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన శాకుంతలం కు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు దిల్ రాజు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈమె వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ లు చేస్తోంది. యశోద అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తుంది. ఆ సినిమా కాకుండా తమిళంలో ఒక సినిమాను నయనతార తో కలిసి చేసింది. త్వరలోనే ఆ సినిమా విడుదల అవ్వబోతుంది. ఇంకా తాప్సి నిర్మాణంలో ఒక సినిమాను కూడా సమంత చేసేందుకు సిద్దం అయ్యింది అనేది టాక్‌. వెబ్‌ సిరీస్ ల్లో కూడా నటించేందుకు ఓకే అన్నట్లుగా ఈఅమ్మడు ఉంది.