Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: సీక్రెట్ టాట్టూ బైట పెట్టిన సామ్
By: Tupaki Desk | 8 July 2019 12:21 PM ISTస్టార్ హీరోయిన్ సమంతా అక్కినేని కొత్త సినిమా 'ఓ బేబీ' పాజిటివ్ టాక్ తో హిట్ దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమాలో సమంతా నటనకు ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. దీంతో సామ్ తొమ్మిదో నంబరు మేఘంపై తాపీగా కూర్చుని ఎంజాయ్ చేస్తూఉంది.. అదేనండీ 'క్లౌడ్ 9'. అంతటితో ఆగితే ప్రత్యేకత ఏముంటుంది చెప్పండి? అందుకే ఒక హాట్ ఫోటో షూట్ చేసింది.
సామ్ స్పెషాలిటీ అందరికీ తెలిసిందే. అక్కినేని ఫ్యాన్స్ కొందరు ఎంత అభ్యంతరం వ్యక్తం చేసినా గ్లామర్ ఫోటో షూట్లు చేయడం మానదు. తాజాగా మరోసారి అదే పని చేసింది. ఈ ఫోటో ద్వారా తన సీక్రెట్ టాట్టూను బైట పెట్టింది. ఈ ఫోటోకు "బెస్ట్ లైఫ్ ను చూస్తున్నాను. (ఇప్పటివరకూ దాచిపెట్టిన నా పచ్చబొట్టును ఫైనల్ గా చూపిస్తున్నా) చైతన్య అక్కినేని మై హబ్బీ మై వరల్డ్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. వైట్ కలర్ టాప్.. బెల్ బాటం స్టైల్ కు దగ్గరగా ఉంటె పలాజో ప్యాంట్ ధరించి సూపర్ స్టైలిష్ గా నిలబడింది. కుడిచేతిని పైకెత్తి తలవెనక పెట్టుకుంది.. ఎడమ చేతిని తన మొహం దగ్గరగా పెట్టుకొని ఒక సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఎడమ చేతిని పైకెత్తడంతో టాప్ కాస్త పైకి జరిగి తన రహస్యపు పచ్చబొట్టు కనిపిస్తోంది. అయితే అదేంటో మాత్రం క్లియర్ గా తెలియడం లేదు.
సామ్ కు టాట్టూలు కొత్త కాదు.. మణికట్టుపై ఒకటి.. నడుముపై మరొకటి ఉంది. ఇప్పుడు కొత్త టాటూ గురించి కూడా అందరికీ చెప్పేసింది. చైతు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది కాబట్టి ఈ టాట్టూ చైతూకు సంబంధించింది అయి ఉంటుందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ టాటూ ఫోటోలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. "స్టైల్ క్వీన్.. సూపరో సూపర్".. "ఫుల్ టాట్టూ చూపించవా సామ్".. "వైట్ డ్రెస్.. హాట్ టాట్టూ" అంటూ కామెంట్స్ పెట్టారు. ఒకరు మాత్రం "ఈ ఫోటోతో నన్ను డిజప్పాయింట్ చేశావు" అన్నారు.