Begin typing your search above and press return to search.
నిర్మొహమాటంగా దర్శకేంద్రుడికి నో చెప్పిన సామ్
By: Tupaki Desk | 9 Dec 2020 10:55 AM ISTదర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు త్వరలో నటుడిగా తెరంగేట్రం చేయనున్నారన్న వార్త ఆశ్చర్యపరుస్తోంది. 78 ఏళ్ల ఈ సీనియర్ దర్శకుడు మెయిన్ లీడ్ లో ఓ మూవీ త్వరలోనే తెరపైకి రాబోతోంది. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు.. దర్శక రచయిత తనికెళ్ల భరణి దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
ఓ రిటైర్డ్ అధికారి తన జీవితంలో గడిచిపోయిన మధుర జ్ఞాపకాల్ని గుర్తు చేసుకునే క్రమంలో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ మూవీ సాగనుందట. `మై ఆటో గ్రాఫ్ స్వీట్ మెమోరీస్` తరహాలో సాగే ఈ చిత్రంలో రాఘవేంద్రరావుకు జోడీగా ముగ్గురు హీరోయిన్ లని అనుకున్నారు. రమ్యకృష్ణ- శ్రియ- సమంతలని ఫైనల్ చేయాలని తనికెళ్ల భరణి ప్లాన్ చేశారు. ఇప్పటికే రమ్యకృష్ణతో చర్చలు జరిపి ఓకే చేసుకున్నారు. సమంతని కూడా ఇటీవల సంప్రదించారట.
అయితే సమంత మాత్రం 78 ఏళ్ల రాఘవేంద్రారవు పక్కన నటించడానికి ఆసక్తిని చూపించలేదట. తనికెళ్ల భరణి ఇచ్చిన ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించినట్టు తెలిసింది. సమంత ప్లేస్ లో తమన్నాని సంప్రదిస్తున్నారట. సమంత ప్రస్తుతం ఏ సినిమాని అంగీకరించే మూడ్ లో లేదట. ఆ కారణంగానే రాఘవేంద్రావు చిత్రాన్ని తిరస్కరించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సామ్ నటించిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా వేచి చూస్తున్నా దానికి సంబంధించిన సరైన సమాచారం లేదు.