Begin typing your search above and press return to search.

సమంత డాటరాఫ్‌ ప్రభు

By:  Tupaki Desk   |   13 April 2015 7:15 PM IST
సమంత డాటరాఫ్‌ ప్రభు
X
వీకెండ్‌ అయిపోయింది కదా.. ఆ తర్వాత కూడా సన్నాఫ్‌ సత్యమూర్తి నిలబడాలంటే ప్రమోషన్స్‌ ఓ రేంజిలో చేయాల్సిందే. బన్నీ, త్రివిక్రమ్‌ స్టూడియోలు చుట్టేశారు. ఎప్పుడూ తన సినిమాల్ని పెద్దగా ప్రమోట్‌ చేయని త్రివిక్రమ్‌.. ఈసారి ఒక్కడే మీడియా ముందుకొచ్చి అన్ని పత్రికలకూ ఇంటర్వ్యూలిచ్చాడు. ఇప్పుడిక సమంత వంతొచ్చింది. మీడియా ముందుకొచ్చి ఆమె చక్కగా

ఇంటర్వ్యూలిచ్చింది. తనకైతే సన్నాఫ్‌ సత్యమూర్తి భలే నచ్చిందని ఈ కాలంలో విలువల గురించి చెప్పే ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరముందని.. జనాలు కూడా చూడాల్సిన ఇదని చెప్పింది సమంత.

ఈ సందర్భంగా తన తండ్రి గురించి కూడా నాలుగు ముక్కలు మాట్లాడిరది సమంత. ‘‘నేను డాటరాఫ్‌ ప్రభు. ఆయన స్కూల్‌ టీచర్‌. చాలా స్ట్రిక్ట్‌. ఆయన వల్లే నేను చాలా క్రమశిక్షణతో పెరిగాను. ఇప్పుడు కూడా అదే డిసిప్లిన్‌ పాటిస్తున్నాను. చిన్నతనంలో మనకు తల్లిదండ్రులు ఎలా ఉంటారో మనం కూడా అలాగే పెరుగుతాం. నన్నంత క్రమశిక్షణతో పెంచిన మా నాన్నకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు

చెబుతున్నా’’ అని చెప్పింది సమంత. సినిమాలో షుగర్‌ పేషెంట్‌గా నటించడం గురించి మాట్లాడుతూ.. ఈ రోజుల్లో అమ్మాయిలందరికీ ఏదో ఒక సమస్య ఉంటోందని.. తాను కూడా కొన్నాళ్ల పాటు అనారోగ్యం పాలయ్యానని.. హీరోయిన్‌కు షుగర్‌ ఉన్నట్లు చూపించడం పెద్ద విషయం కాదని.. దాన్ని సరదాగా తీసుకోవాలని చెప్పింది సమంత.