Begin typing your search above and press return to search.

టాటూ లు అస్సలే వద్దంటున్న సామ్

By:  Tupaki Desk   |   18 April 2022 8:45 AM GMT
టాటూ లు అస్సలే వద్దంటున్న సామ్
X
సమంతకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తను ఏది చేసిన వైరల్ కావాల్సిందే. కొన్ని రోజులు పెద్ద చర్చ జరగాల్సిందే. ఇక చైతన్యతో తను విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఈ భామ ఏది పెట్టిన వైరల్ అవుతోంది. సమంత ఏ పని చేసినా దాన్ని మరింత వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.

విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటోంది సమంత. తన స్టోరీల్లో ఎప్పుడూ ఫోటోలు, మోటివేషనల్ కోట్స్ పెడుతూనే ఉంటుంది. సమంత చాలా రోజుల తర్వాత తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా అబిమానులతో చిట్ చాట్ చేసింది.

దీంతో అభిమానులు, నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చింది. థియేటర్ లో చూసిన ఫస్ట్ మూవీ ఏంటని ఓ అభిమాని ప్రశ్నించగా, జురాసిక్ పార్క్ అని చెప్పింది సామ్.

ఇక మొదటి సంపాదన ప్రస్తావన తీసుకురాగా, ఓ హోటల్ లో హోస్టెస్ గా 8 గంటలు పని చేసి, రూ.500 అందుకున్నట్లు గుర్తు చేసుకుంది. అంతే కాదు మీపైన మీరు నమ్మకం పెట్టుకోండి. మీ కలలను సాకారం చేసుకునే దిశగా ప్రయత్నించండి అంటూ అమ్మాయిలకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది.

ఓ అభిమాని టాటూ ప్రస్తావన తెచ్చాడు. ఎప్పటికైనా వేసుకోవాలన్న టాటూ ఏంటని ఓ అబిమాని అడగ్గా.. తాజాగా టాటూలపై కూడా సమంత కీలక వ్యాఖ్యలు చేసింది. సమంత ఒంటిపై పలు చోట్ల టాటూలు వేయించుకున్న సంగతి తెలిసిందే. తాను అసలు ఎలాంటి టాటూలు వేయించుకోకూడదని అనుకున్నట్లు చెప్పుకొచ్చింది. అంతే కాదు అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మానుకోవాలని సలహా ఇచ్చింది. దీంతో సామ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

నాగచైతన్య, సమంత కలిసి నటించిన మొట్ట మొదటి సినిమా ఓ మాయ చేసావే. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. దీంతో ఈ సినిమా గుర్తుగా సామ్.. తన వీపుపై వైఎంసీ అనే అక్షరాలను వీపుపై టాటూ వేయించుకుంది. నడుముపై భాగంలో చై అనే టాటూ ఉంది. అలాగే కుడి చేతి మీద రెండు యారో మార్కులను టాటూ వేయించుకుంది. అయితే ఇలాంటి టాటూ నాగచైతన్య చేతికి కూడా ఉంటుంది.