Begin typing your search above and press return to search.

నారా అబ్బాయికి సమంత సాయం

By:  Tupaki Desk   |   30 Sept 2017 12:51 AM IST
నారా అబ్బాయికి  సమంత సాయం
X
సినిమా కెరీర్ లో ఏ హీరో అయినా వరుసగా ఓ రెండు మూడు అపజయాలను అందుకుంటే ఆ తర్వాత ఎక్కువగా ప్రయోగాత్మకమైన చిత్రాలను తెరకెక్కించాడని భయపడతాడు. కానీ జయాపజలతో సంబంధం లేకుండా పూర్తిగా వినూత్న కథలను ఎంచుకుంటున్నాడు నారా రోహిత్. గత సినిమాల ప్రభావాన్ని లెక్క చేయకుండా సినిమాలను తీస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అతను చేసిన ప్రయాగాలు ఇంతవరకు అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు.

2015 లో వరుసగా ఆరు సినిమాలను చేశాడు. చాలా వరకు ఆ సినిమాలు నారా అబ్బాయికి నిరాశనే మిగిల్చాయి. రీసెంట్ గా వచ్చిన కథలో రాజకుమారుడు కూడా అపజయాన్నే అందుకుంది. ఇక ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని రోహిత్ కొత్త ప్లాన్ ని ఆచరణలో పెట్టనున్నాడు. నెక్స్ట్ రాబోయే బాలకృష్ణుడు సినిమాకు ప్రమోషన్స్ ని ఎక్కువగా చేయాలనుకుంటున్నాడు. అందుకోసం టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత హెల్ప్ తీసుకోబోతున్నాడు. శనివారం సమంత ద్వారా బాలకృష్ణుడు సినిమా టీజర్ ని లంచ్ చేయించనున్నాడు రోహిత్.

అదే విధంగా చిత్ర యూనిట్ సినిమా రిలీజ్ వరకు సమంతని కొన్ని సహాయాలను కోరిందట. సోషల్ మీడియాలో సమంత ఎంత చురుగ్గా పాల్గొంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. దీంతో బాలకృష్ణుడు సినిమాను కాస్త సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్స్ చేయమని కోరారట. ఇక బాలకృష్ణుడు సినిమాలో నారా రోహిత్ సిక్స్ ప్యాక్ లో కనిపిస్తున్నాడు. పవన్ మల్లెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రెజీనా నటిస్తుండగా మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. నవంబర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.