Begin typing your search above and press return to search.

సామ్ ను ఇంత క్యూట్ గా చూసి ఎన్నాళ్లయిందో కదా!

By:  Tupaki Desk   |   28 March 2023 1:05 PM GMT
సామ్ ను ఇంత క్యూట్ గా చూసి ఎన్నాళ్లయిందో కదా!
X
స్టార్‌ హీరోయిన్‌ సమంత శాకుంతలం సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉంది. కొన్ని నెలలుగా సమంత మయోసైటిస్ సమస్యతో బాధపడుతూ మీడియా కు పూర్తిగా దూరం అయింది. ఒకానొక సమయంలో సమంత కనీసం అడుగు తీసి అడుగు పెట్టలేక పోయింది. ఈ విషయాన్ని స్వయంగా సమంత చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే.

కొన్ని నెలల పాటు అనారోగ్య సమస్యల కారణంగా ఫేస్ లో కూడా గ్లో మిస్ అయింది. సమంత గతంలో మాదిరిగా అందంగా లేదని కొందరు ఆ మధ్య కామెంట్స్ చేశారు.. సమంత ఆ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చింది. మళ్లీ తన పూర్వ రూపంలోకి వచ్చిన సమంత అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. శాకుంతలం సినిమా ప్రమోషన్ లో సమంత చాలా యాక్టివ్ గా కనిపించింది.

సమంత యొక్క అందం విషయంలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్కిన్‌ షో చేసినా.. పద్దతైన డ్రెస్ లో ఫోటో షూట్స్ చేసినా కూడా వైరల్ అవుతాయి. సమంత ఫోటోలు చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ దృష్టి ని ఆకర్షిస్తున్నాయి. తాజాగా తెల్లటి డ్రెస్ లో క్యూట్‌ స్టిల్స్ ను షేర్‌ చేసిన సమంత అందరి దృష్టిని ఆకర్షించింది.

సమంత షేర్ చేసిన ఈ ఫొటోలకు అభిమానులు తెగ లైక్స్ చేస్తున్నారు. సామ్ ఇన్‌ స్టా లో ఈ ఫొటోలు షేర్‌ చేసిన గంటలోనే ఏకంగా ఆరు లక్షల లైక్స్ ను సొంతం చేసుకుంది.

ఈ స్థాయిలో సామ్‌ ఫొటోలకు రెస్పాన్స్ దక్కడం ఈమధ్య కాలంలో రేర్‌ గా జరుగుతుంది. సామ్ ను ఇంత క్యూట్‌ గా చూసి ఎన్నాళ్లయిందో అంటూ అభిమానులు తెగ కామెంట్స్ చేస్తూ మురిసిపోతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.