Begin typing your search above and press return to search.
4వ సారి: ఎన్టీఆర్ సరసన సమంత
By: Tupaki Desk | 27 Nov 2015 4:14 AM GMTయంగ్ యమ ఎన్టీఆర్ సరసన బృందావనం - రభస - రామయ్య వస్తావయ్య చిత్రాల్లో కథానాయికగా ఆడిపాడింది అందాల సమంత. బృందావనం క్లాసిక్ హిట్ మూవీ. ఆ తర్వాత వచ్చిన రామయ్యా వస్తావయ్యా అట్టర్ ఫ్లాప్. రభస యావరేజ్ సినిమా. ఇప్పటికి వరుసగా మూడు సినిమాల్లో నటించింది. ఇప్పుడు నాలుగోసారి ఎన్టీఆర్ తో జత కట్టేందుకు రెడీ అవుతోంది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇందులో కథానాయికగా సమంత నటించనుందని సమాచారం. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించకపోయినా సమంత ఆల్ మోస్ట్ ఫైనల్ అయినట్టేనని యూనిట్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
సమంత గోల్డెన్ లెగ్. తను ఉంటే చాలు హిట్టు కొట్టేసినట్టే అనేది దర్శకనిర్మాతల సెంటిమెంటు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అ.. ఆ చిత్రంలో - శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం చిత్రాల్లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమాకి రెడీ అవుతుంది.