Begin typing your search above and press return to search.

సమంత అనసూయ కాదటండీ!!

By:  Tupaki Desk   |   15 Sept 2015 9:33 AM IST
సమంత అనసూయ కాదటండీ!!
X
అబ్బే. సమంత సమంతే.. అనసూయ అనసూయే.. ఒకావడి చెన్నయ్‌ నుండి స్టార్‌ సోయగం. వెండితెరను ఇట్టే తన మ్యాజిక్‌ లో పడేసే రసికశిఖామణి. ఇక మరొక భామ ఎవరంటే బుల్లి తెరను తన సొగసులతో కట్టి పాడేసే మస్త్‌ జబర్‌ దస్త్‌ లేడీ. హోల్డాన్‌.. హోల్డాన్‌.. మనం మాట్లాడుతుంది ఈ అనసూయ గురించా కాదసలు. పదండి మ్యాటర్‌ లోకి వెళదాం.

త్రివిక్రమ్‌ కొత్త సినిమా ఉంది చూశారూ.. ''అ..ఆ..'' అనేది టైటిల్‌. అనసూయ రామలింగం వర్సెస్‌ ఆనంద్‌ విహారీ అనేది క్యాప్షన్‌. అయితే ఈ పాత్రల్లో మెరుస్తోంది మన నితిన్‌ - సమంతలు కాదట. ఆనంద్‌ అంటే నితిన్‌ బాబే కాని, అనసూయ అంటే మాత్రం 'అత్తయ్య' నదియా అని తెలుస్తోంది. అంటే ఇది మరోసారి అత్తా అల్లుళ్ళ కథ అనమాట.. ఇంతకుముందు పవన్‌ కళ్యాణ్‌ తో తీసిన అత్తారింటికి దారేది కూడా సేమ్‌ టు సేమ్‌ ఇలాంటి పాయింటే. కాకపోతే ఇందులో క్యారెక్టర్ లు చాలా కొత్తగా ఉంటాయని అంటున్నారు.

ఇకపోతే టైటిల్‌ రోల్‌ సమంత పోషిస్తే ఆ కిక్కే వేరబ్బా అనుకున్నారు ఆమె అభిమానులు.. కాకపోతే త్రివిక్రమ్‌ సినిమాలో సమంతకు రోల్‌ అంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందిలే ఖచ్చితంగా.. కాకపోతే ఈసారి అలా కళ్ళద్దాలో - లేకపోతే అంటూ లో-షుగర్‌ అంటూ ఏదో ఒక లోపం పెట్టకుండా కాస్త గ్లామరస్‌ గా చూపిస్తే బాగుండు అంటున్నారు అభిమానులు.