Begin typing your search above and press return to search.

అర్రే ..! స‌మంత‌ చేయ‌ట్లేదుట‌గా..!!

By:  Tupaki Desk   |   27 Sept 2015 10:20 AM IST
అర్రే ..! స‌మంత‌ చేయ‌ట్లేదుట‌గా..!!
X
ఇటీవ‌లి కాలంలో సినిమా నిర్మాణంలో కొత్త సిస్ట‌మ్ త‌యార‌వుతోంది. హీరోల‌కు భారీ రెమ్యున‌రేష‌న్ క్యాష్ రూపంలో ఇవ్వ‌కుండా కొన్ని ఏరియాల పంపిణీ హ‌క్కులు అప్ప‌జెప్ప‌డం ద్వారా ప్రొడ‌క్ష‌న్‌ లో భాగ‌స్వాముల్ని చేస్తున్నారు. ఈ న‌యా ట్రెండ్ రోజుకో రూపం తీసుకుంటోంది. స్టార్ హీరోలు - స్టార్ హీరోయిన్‌ లు రెమ్యున‌రేష‌న్ స్థానంలో ఏరియాల హ‌క్కులు అడిగే ప‌నిలో ఉన్నారు. టాలీవుడ్‌ లోకి ఈ న‌యా ట్రెండ్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది.

శ్రీ‌మంతుడు కోసం మ‌హేష్ రెమ్యున‌రేష‌న్ లేకుండా ప్రొడ‌క్ష‌న్‌ లో భాగం అయ్యాడు. నిర్మాత‌గా లాభాల్లో షేర్‌ ని జేబులో వేసుకున్నాడు. లేటెస్టుగా శ్రీ‌దేవి కూడా పులి సినిమా విష‌యంలో రెమ్యున‌రేష‌న్‌ తో పాటు రిలీజ్‌లో వాటా అడిగింద‌న్న పుకార్లు వ‌చ్చాయి. ఇదే బాట‌లో నిన్న‌టిరోజున అందాల స‌మంత గురించి ఓ పుకారు టాలీవుడ్‌ ని ప‌ట్టి కుదిపేసింది. స‌మంత కూడా నిర్మాత గా మారింది. సూర్య సినిమా 24ని తెలుగులో రిలీజ్ చేస్తోంది అంటూ పుకారు వ‌చ్చింది.

ఇదే విష‌యాన్ని అమ్మ‌డినే అడిగితే .. ప‌క‌ప‌కా న‌వ్వేస్తూ .. ఇలాంటి వార్త‌లు ఎలా పుట్టుకొస్తాయో.. అంతా అబ‌ద్ధం అని కొట్టి పారేసింది. ప్ర‌స్తుతం పోల్యాండ్‌ లో షూటింగులో పాల్గొంటున్న స‌మంత .. తాను నిర్మాత అవ్వ‌డ‌మేంటి? అంటూ కొట్టి పారేసింది. సూర్య స‌ర‌స‌న 24 చిత్రంలో స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తోంది. కాబ‌ట్టి పారితోషికాన్నే .. ఇలా ఓ ఏరియా హ‌క్కుల రూపంలో తీసుకుంటుందేమో.. అన్న సందేహాలు జ‌నాల‌కు వ‌చ్చాయి.