Begin typing your search above and press return to search.

యోగాలో 'ఈశా'ను ఫాలో అవుతున్న స్టార్ హీరోయిన్..!

By:  Tupaki Desk   |   24 Jun 2020 9:15 AM IST
యోగాలో ఈశాను ఫాలో అవుతున్న స్టార్ హీరోయిన్..!
X
అక్కినేని సమంత అంటే సౌత్ ఇండియన్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. పెళ్లి తర్వాత కూడా మంచి ఫామ్ లో ఉన్న ఈ భామ ఫిట్నెస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని అందరికి తెలిసిన విషయమే. అయితే ఓ బేబీ సినిమా విజయం సాధించిన తరువాత సమంత ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇంతవరకు సమంత తరువాత ప్రాజెక్టు ఏమిటా అని అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఇప్పడు సమంత ఏం చేసినా సోషల్ మీడియాలో సంచలనమే అవుతోంది. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయిన సమంత సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. తరచు ఫిట్నెస్ కి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఫోటోలు వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంది. తాజాగా అమ్మడు అదే తరహాలో ఆమె ఇంస్తాగ్రాంలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలతో అందరిలోనూ ఆసక్తి పెంచింది.

సమంత ఎంత బిజీగా ఉన్నా.. ఆరోగ్యం పట్ల అనేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఉంటుంది. ఇక ప్రస్తుత మహమ్మారి కాలంలో అమ్మ‌డు తీసుకుంటున్న జాగ్ర‌త్త‌లు మాములుగా లేవు. అందరి సలహాలు పాటిస్తూ.. ఆరోగ్యం పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వహిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా స‌మంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప‌లు ఫోటోలు షేర్ చేసి.. "యోగా ప్ర‌క్రియ‌ల‌లో ఒక‌టైన ఈశా క్రియ‌ని ప్రారంభించిన‌ట్టు చెప్పుకొచ్చింది. 48 రోజుల పాటు సమంత ఈ ప్రక్రియను చేయ‌నుండ‌గా.. త‌న అభిమానులు కూడా ఈశా క్రియ చేయాలని, తనతో జాయిన్ కావాలని కోరింది. దీని వ‌ల‌న మాన‌సిక ప్ర‌శాంత‌త‌.. ఆరోగ్యం.. సామ‌ర్ధ్యాన్ని పెంచే శ‌క్తి ల‌భిస్తుంద‌ని తెలుపుతుంది ఈ 'ఏం మాయ చేసావే' అమ్మడు. అందంతో పాటు ఆరోగ్యం కూడా చేకూర్చే ఈశా క్రియ చేయడం చాలా మంచిదని స‌మంత చెప్పుకొచ్చింది. అయితే దేనికోసం సమంత ఇంత చేస్తోంది. ఎలాగో షూటింగ్స్ కి వెళ్లట్లేదు కదా.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..