Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ అత్తకు అలా కౌంటర్ ఇచ్చిందా..?

By:  Tupaki Desk   |   25 April 2020 9:28 PM IST
ఆ హీరోయిన్ అత్తకు అలా కౌంటర్ ఇచ్చిందా..?
X
తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేక మర్యాద ఉంది. ఈ మధ్య అక్కినేని కుటుంబంలో అంతర్యుద్ధం నడుస్తున్నట్లు అన్పిస్తుంది. ఫిలింనగర్లో ఎప్పటినుంచో ఈ వార్త చక్కర్లు కొడుతుంది. నాగార్జున కుటుంబంతో చైతు సమంత ఇద్దరు ఈ మధ్య దూరంగా ఉంటున్నారని టాక్‌. దానికి తగినట్లుగానే ఈ మధ్య అఖిల్ పుట్టినరోజు సందర్భంగా సమంత, చైతన్య ఇద్దరూ సోషల్ మీడియాలో విష్ కూడా చెప్పలేదట. దీంతో ఆ వార్తలు జోరుగా ప్రచారం అందుకున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో అమలను.. సమంత మీకు వంట చేసి పెడుతుందా..? అని ప్రశ్నిస్తే.. మా ఇంట్లో నాగార్జున బాగా వంటలు చేస్తారు.

ఇక ఇంకొకరు ఎందుకు అన్నట్లు కామెంట్ చేసింది. అంతేగాక అక్కినేని కుటుంబంలో ఆడవాళ్లు ఎవరూ వంటలు చేయరని ఆమె చెప్పింది. ఇక తాజాగా కోడలు సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ట్రప్ఫెల్ మస్రూమ్‌ పాస్తాను తయారు చేసిన సమంత ఆ పోస్ట్‌ను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. మా ఇంట్లో ఆడవాళ్లు వంటలు చేయరన్న అమలకు కౌంటర్ ఇచ్చినట్లు వండి చూపించిందని సోషల్ మీడియాలో కామెంట్లు ఊపందుకున్నాయి. ఈ విధంగా ఒకరిపై ఒకరు డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా కోల్డ్ వార్ చేసుకుంటున్నారని టాక్ విపరీతంగా వినిపిస్తోంది. అత్తకు తగ్గ కోడలు అని సమంతను పొగిడేస్తున్నారట.