Begin typing your search above and press return to search.
సామ్ డిమాండ్ మాములుగా లేదే
By: Tupaki Desk | 22 April 2019 9:38 AM ISTఅక్కినేని కోడలిగా మారి ఏడాది దాటినా హీరొయిన్ గా తన డిమాండ్ ని కొనసాగిస్తూనే ఉంది సమంతా. గత ఏడాది రంగస్థలం-మహానటి-అభిమన్యుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో పాటు యుటర్న్ లో నటన ద్వారా సీమరాజాలో కత్తి సాము ద్వారా ఆకట్టుకున్న సామ్ కు కొత్త సంవత్సరం కూడా భలేగా కలిసి వస్తోంది. ముందు తమిళ్ లో సూపర్ డీలక్స్ తో బోణీ కొట్టేసిన సామ్ అందులో ఎవరూ ఊహించని పాత్ర చేసి షాక్ ఇచ్చింది.
వారం తిరక్కుండానే మజిలి లాంటి బ్లాక్ బస్టర్ లో క్రెడిట్ తీసుకుని అందరూ తన గురించే మాట్లడుకునేలా చేసింది. అందులో శ్రావణి పాత్ర తను కాకుండా ఇంకెవరు చెసినా ఇంత రేంజ్ సక్సెస్ అయ్యేదా అని అనుమానపడే రేంజ్ లో కాంప్లిమెంట్స్ అందుకుంది. త్వరలో విడుదల కానున్న ఓ బేబీ మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి
దెబ్బకు సమంతా డిమాండ్ ఇప్పుడు మాములుగా లేదు. ప్రస్తుతం 96 రీమేక్ తో పాటు మన్మధుడు 2 మాత్రమే కమిట్ అయిన సమంతా కోసం నిర్మాతల క్యు పెద్దదే ఉందట. ఫిలిం నగర్ టాక్ ప్రకారం ఇప్పుడు సమంతా రెమ్యునరేషన్ 3 కోట్ల దాకా చెబుతోందట. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పటిదాకా మాడరన్ జనరేషన్ లో పెళ్ళయ్యాక ఇంత భారీ మొత్తం అందుకున్న ఒకే ఒక్క హీరొయిన్ సమంతానే.
ఎవరిదాకో ఎందుకు ఫుల్ డిమాండ్ అని చెప్పుకునే గ్లామరస్ హీరొయిన్లకు సైతం కోటిన్నర నుంచి రెండు కోట్ల మధ్య ఇవ్వడానికే నిర్మాతలు ముందు వెనుకా ఆలోచిస్తున్నారు. అలాంటిది సమంతా 3 కోట్లు అన్నా రెడీ అవుతున్నారు అంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.