Begin typing your search above and press return to search.

బాద్షాతో మూవీ.. సామ్ రెమ్యునరేష్ తెలిస్తే షాకే

By:  Tupaki Desk   |   19 Oct 2021 11:30 PM GMT
బాద్షాతో మూవీ.. సామ్ రెమ్యునరేష్ తెలిస్తే షాకే
X
‘నన్ను ఒంటరిగా వదిలిపెట్టండి’ అంటూ ట్వీట్ తో కోరినప్పటికి సమంతకు సంబంధించిన వార్తలు ఏదో ఒకటి నిత్యం వస్తూనే ఉన్నాయి. చైతూతో విడిపోయిన తర్వాత వరుస సినిమాలకు ఓకే చెప్పేస్తున్న సంగతి తెలిసిందే. విడిపోయిన తర్వాత కొత్త కండీషన్లు పెడుతున్నా ఆమెతో సినిమాలు చేయటానికి నిర్మాతలు ముందుకు రావటం ఒక ఎత్తు అయితే.. తాజాగా బాలీవుడ్ మూవీకి కూడా సమంత సైన్ చేసినట్లుగా చెబుతున్నారు.

ఫ్యామిలీమ్యాన్ -2 వెబ్ సిరీస్ తో అందరికి దగ్గరైన సమంతకు తాజా మూవీతో బాలీవుడ్ ఎంట్రీ దొరికినట్లుగా చెప్పాలి. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న ఈ మూవీకి అట్లీ దర్శకత్వం వహిస్తున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఈ మూవీ నయనతార చేస్తున్నట్లుగా వార్తలు వచ్చినా.. తాజాగా ఆమె స్థానంలో సమంతను తీసుకున్నట్లు చెబుతున్నారు. బాలీవుడ్ ఎంట్రీ మూవీకి సమంత భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీకి సమంత తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఏకంగా రూ.7కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. అదే నిజమైతే.. సామ్ బాలీవుడ్ ఎంట్రీ అదిరే స్థాయిలో షురూ అవుతుందని చెప్పాలి. బాలీవుడ్ టాప్ హీరోతో.. తన మూవీలతో అదరగొట్టే డైరెక్టర్ తో మూవీ అంటే.. సామ్ కు అంతకు మించి కావాల్సిందేముంది?