Begin typing your search above and press return to search.

ఏడాదంతా సమంతకు పండగే

By:  Tupaki Desk   |   1 Feb 2018 12:45 PM IST
ఏడాదంతా సమంతకు పండగే
X
గ‌తేడాది స‌మంత సినిమాలు ఆడింది లేదు... అస‌లు విడుద‌లైన‌వే లేవు. రాజు గారి గ‌ది 2లో ఆమె క‌నిపించినా... అది అతిధి పాత్రే. ఇక మెర్సెల్ లో మెరిసినా అది కూడా కొన్ని నిమిషాల పాత్రే. క‌నుక ఆ రెండూ స‌మంత ఖాతాలోకి రావు. ఆమె హీరోయిన్‌గా క‌నిపించిన సినిమా 2017లో శూన్యం. కానీ 2018 అలా కాదు... స‌మంత నామ సంవ‌త్స‌రంగా మార‌బోతోంది.

ఈ ఏడాది స‌మంత చాలా బిజీ... సినిమా షూటింగుల తోనూ - వ‌రుస సినిమాల విడుద‌ల తోనూ ఉక్కిరిబిక్కిరైపోతుంది. మార్చి నుంచి వ‌రుస‌గా సినిమాలు విడుద‌ల కాబోతున్నాయి. ముందుగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో... చెర్రీ ప‌క్క‌న న‌టించిన రంగ‌స్థ‌లం విడుద‌ల‌వుతుంది. ఆ త‌రువాత త‌మిళంలో విశాల్‌ - స‌మంత న‌టించిన ఇరుంబుదురై.. తెలుగులో అభిమ‌న్యుడు పేరుతో విడుద‌ల‌వుతుంది. త‌మిళంలో మాత్రం ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల‌వుతుంది. త‌మిళంలో స‌మంత న‌టించిన సూప‌ర్ డీల‌క్స్ కూడా ఈ వేస‌వికే ధియేట‌ర్ల‌లోకి రానుంది.

అలాగే స‌మంత ప్ర‌ధాన పాత్ర‌గా యూ ట‌ర్న్ అనే సినిమా సెట్స్ మీద‌కి వెళ్ల‌బోతోంది. ఆ సినిమా కూడా ఈ ఏడాది ద్వితీయార్థంలోనే విడుద‌ల కానుంది. ఇక శివ కార్తికేయ ప‌క్క‌న ఓ సినిమాలో న‌టిస్తోంది స‌మంత‌. అది కూడా ఈ ఏడాది చివ‌ర్లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. మొత్త‌మ్మీద ఈ ఏడాదంతా స‌మంత‌కు, ఆమె అభిమానుల‌కు పండ‌గే పండ‌గ‌.