Begin typing your search above and press return to search.
క్యూట్ త్రిషకు సమంత రికమండేషన్
By: Tupaki Desk | 14 July 2015 4:51 PM ISTఅందాల త్రిష ముచ్చటగా మూడోసారి సిద్ధార్థ్ సరసన నటిస్తోంది. దర్శకమణి మణిరత్నం దర్శకత్వంలో 'యువ' చిత్రంలో సిద్ధూ సరసన నాయికగా నటించింది. పెయిర్ బావుందన్న చర్చ చాలా కాలం సాగింది. ఆ తర్వాత మళ్లీ ప్రభుదేవా దర్శకత్వంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో జోడీగా నటించారు. అది రెండో ఛాన్స్. ఇపుడు ముచ్చటగా మూడో అవకాశం అందుకుంది అమ్మడు. సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆరణ్మయి 2లో త్రిష అవకాశం అందుకుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్‌కి పెయిర్‌గా నటిస్తోంది.
అయితే విచిత్రంగా త్రిషకు ఈ అవకాశం ఎలా వచ్చింది అన్న ప్రశ్నకు ఓ ఇంట్రెస్టింగ్ హింట్ దొరికింది. సిద్ధార్థ్ మాజీ లవర్ సమంత సిఫార్సు మేరకు ఈ అవకాశం వచ్చిందని చెబుతున్నారు. వాస్తవానికి సుందర్.సి కాస్టింగ్‌లో సిద్ధార్థ్ పేరు లేదు. తననే తీసుకోవాల్సిందిగా సమంత సిఫార్సు చేసింది. అలా సిద్ధూ ప్రాజెక్టులోకి వచ్చాడు. ఇటీవలి కాలంలో వరుస పరాజయాలతో కెరీర్ ఎండింగ్‌లో ఉన్న టైమ్‌లో సిద్ధూకి ఊపిరి పోసే అవకాశమిది. అదీ మాజీ ప్రేయసి రూపంలో వచ్చినది. పైగా తనకు కాంపిటీటర్ అయిన త్రిష సరసన అవకాశం ఇప్పించింది సమంత. సిద్దూ.. వీలైతే ఓ థ్యాంక్స్, కుదిరితే ఓ వాట్సప్ మెసేజ్ పెట్టేయ్ నానా.