Begin typing your search above and press return to search.

నాగ్ మామ సామ్ రికమెండేషన్ ఒప్పుకుంటాడా?

By:  Tupaki Desk   |   20 Aug 2018 6:45 AM GMT
నాగ్ మామ సామ్ రికమెండేషన్ ఒప్పుకుంటాడా?
X
సమంతా అక్కినేని వారి కోడలు అయిన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అంతే కాకుండా తన పాత ఫ్రెండ్స్ ను ఏమాత్రం మర్చిపోలేదు. సమంతాకు రాహుల్ రవీంద్రన్ - చిన్మయి లు ఇండస్ట్రీ కి వచ్చిన సమయం నుండి మంచి ఫ్రెండ్స్. ఇప్పటికీ వాళ్ళ ఫ్రెండ్షిప్ అలానే కంటిన్యూ అవుతోంది. ఈమధ్య రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'చి ల సౌ' సినిమా ను అన్నపూర్ణ బ్యానర్ ద్వారా రిలీజ్ చేయడంలో కూడా సామ్ పాత్ర ఉంది.

ఇప్పుడు తాజాగా ఫిలిం నగర్ లో మరో టాక్ వినిపిస్తోంది.. అదేంటంటే 'మన్మథుడు - 2 సినిమాకు రాహుల్ రవీంద్రన్ ను డైరెక్టర్ గా తన మామగారు నాగర్జున కు రికమెండ్ చేసిందట. నాగార్జున ఈ మధ్యనే 'మన్మథుడు-2' టైటిల్ ను అన్నపూర్ణ బ్యానర్ పై రిజిస్టర్ చేయించిన విషయం తెలిసిందే. మొదట్లో ఈ టైటిల్ చైతు లేదా అఖిల్ కోసం అయి ఉంటుందని అన్నారుగానీ ఈ సినిమా టైటిల్ నాగార్జున కోసమేనట. మరి నాగార్జున ఈ సినిమా దర్శకుడిగా రాహుల్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేది వేచి చూడాలి.

'చి ల సౌ' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాహుల్ మాట్లాడుతూ ఇప్పటికే అన్నపూర్ణ బ్యానర్ వారికి రెండు కథలు వినిపించానని ఒకటి ఫైనల్ అయ్యే అవకాశం ఉందని అన్నాడు. మరి ఆ ఒక్కటి ఈ 'మన్మథుడు-2' స్టొరీయేనా కాదా అన్నది తెలియాలంటే మనం కొద్ది రోజులు వెయిట్ చెయ్యక తప్పదు.