Begin typing your search above and press return to search.
భారీ లాభాలు అందుకుంటున్న సమంత నటిగా కాదు!
By: Tupaki Desk | 23 March 2021 6:00 AM ISTసౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు అక్కినేని కోడలు సమంత. అయితే నాగచైతన్యతో పెళ్లి కాకముందే సామ్ స్టార్ హీరోయిన్. ఇక పెళ్లయ్యాక నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేసుకుంటూ సూపర్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం సామ్ తెలుగులో ఒకే ఒక్కసినిమా చేస్తోంది. అదే శాకుంతలం. అయితే ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ రంగంలో కూడా తన సత్తా చాటుతోంది సామ్. యూత్ బాగా కనెక్ట్ అయ్యేవిధంగా మోడరన్ బిజినెస్ ఆలోచనలతో దూసుకెళ్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియోనే అందుకు నిదర్శనం. ప్రపంచంలో రోజురోజుకి టెక్నాలజీతో పాటు ఆధునికత కూడా పెరుగుతూ మార్పులు చెందుతోంది. ఈ ఆధునిక టెక్నాలజీని సదుపాయాలను అనుసరించి సామ్ ఆన్ లైన్ ఫ్యాషన్ స్టోర్ ఓపెన్ చేసింది.
'సాకీ' అనే పేరుతో సామ్ అనుకున్న విధంగా తన బిజినెస్ ను జనాల్లోకి తీసుకొచ్చింది. ఇటీవలే ప్రారంభించిన ఈ ఫ్యాషన్ బిజినెస్ ప్రస్తుతం సమంతకు మంచి లాభాలు తెస్తోందట. ఫేవరేట్ హీరోయిన్ కావడంతో జనాలు, ఫ్యాన్స్ అలా కనెక్ట్ అయిపోయి బిజినెస్ ఊపందుకుంది. అలాగే ఆన్ లైన్ స్టోర్ కావడం జనాలకు కలిసి వచ్చింది. ఆన్ లైన్ కాబట్టి కేవలం ఒక ప్రాంతానికి దేశానికి అనే అడ్డులేకుండా.. విదేశాల నుండి సైతం ఆర్డర్స్ రావడం చెప్పుకోదగ్గ విషయం. ఈ సందర్బంగా సామ్ వీడియో పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసా..? ''సాకీ స్టోర్ దుస్తులను అమెరికా, సింగపూర్, మలేషియా దేశాలకు కూడా పంపిస్తున్నాం'' అంటూ పోస్టులో చెప్పుకొచ్చింది. ఈ మేరకు సామ్ వీడియోలో అద్దం ముందు నిలబడి చకచకా దుస్తులు మార్చుకుంటూ కనిపించింది. మోడ్రన్ జనాన్ని ఆకర్షించేలా తన బ్రాండ్‌ను బాగానే ప్రమోట్ చేస్తోంది. ప్రస్తుతం అమ్మడు శాకుంతలం, కాతువకుల రెండు కాదల్ సినిమాలు చేస్తోంది.