Begin typing your search above and press return to search.

క‌ర‌ణ్ తో కాఫీకి రెడీ అయిన స‌మంత‌

By:  Tupaki Desk   |   23 Jun 2022 6:20 AM GMT
క‌ర‌ణ్ తో కాఫీకి రెడీ అయిన స‌మంత‌
X
పాన్ ఇండియా స్టార్ డ‌మ్ తో దేశంలోనే గొప్ప ఫాలోయింగ్ ఉన్న‌ స్టార్ గా వెలిగిపోతోంది స‌మంత. ఫ్యామిలీమ్యాన్ 2 సిరీస్ లో రాజీ పాత్ర‌తో హిందీ ఆడియెన్ కి క‌నెక్ట‌యిపోయిన సామ్ ఆ త‌ర్వాత 'పుష్ప‌' చిత్రంలో ఊ అంటావా.. సాంగ్ తో దేశ‌వ్యాప్తంగా యువ‌త‌రానికి మ‌రింత‌గా చేరువైంది. హిందీ చిత్ర‌సీమ‌లో ప్ర‌స్తుతం వ‌రుస అవ‌కాశాల్ని అందుకుంటోంది. తాజా స‌మాచారం మేర‌కు.. స‌మంత కండ‌ల హీరో స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న క్రేజీ ఆఫ‌ర్ అందుకుంద‌ని తెలిసింది. నో ఎంట్రీ సీక్వెల్లో సామ్ ని ఎంపిక చేసార‌ని టాక్ వినిపిస్తోంది.

ఇంత‌లోనే కాఫీ విత్ క‌ర‌ణ్ షోతో అభిమానుల ముందుకు రాబోతోంది.
స్టార్ హీరోయిన్ సమంత కొన్ని రోజుల క్రితం పాపుల‌ర్ రియాలిటీ షో కోసం క‌ర‌ణ్ జోహార్ తో షూటింగులో పాల్గొంది. అయితే ఈ షోలో సామ్ తో పాటు కాఫీ తాగే స్టార్ హీరో ఎవ‌రో రివీల్ కాలేదు. ఇప్పటి వరకు ఏ నటుడితో సామ్ షోలో పాల్గొంటోంది అనేది తెలియ‌లేదు. తాజా స‌మాచారం మేర‌కు...సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తో క‌లిసి షో కోసం షూటింగులో పాల్గొంద‌ని తెలిసింది.

ఈ షోలో చాలా విష‌యాల్ని స‌మంత మాట్లాడ‌నుంది. చైతో విడాకుల గురించి సమంత మొదటిసారిగా ఓపెన్ కానుంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీంతో క‌ర‌ణ్ షో కోసం నిరీక్షణ పెరిగింది. అభిమానుల్లో ఉత్కంఠ అంత‌కంత‌కు పెరుగుతోంది. ఇక ఖిలాడీ అక్షయ్ కుమార్ తో స‌మంత‌ ఎంట్రీ షోను రంజుగా మారుస్తుంద‌డంలో సందేహం లేదు. జూలై 8 నుండి డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో 'కాఫీ విత్ కరణ్' ప్రసారం కానుంది. ప‌లువురు టాప్ సెల‌బ్రిటీల‌ను క‌ర‌ణ్ ఎంపిక చేసుకోగా ఇందులో సౌత్ కి చెందిన ప్ర‌ముఖ స్టార్లు ఉన్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. సమంత గ‌త చిత్రం 'కాతు వాకులా రెండు కాదల్‌' సంతృప్తిక‌ర ఫ‌లితాన్ని అందించింది. నయనతార- విజయ్ సేతుపతి- స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల్లో విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు విమర్శకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది.

బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. మ‌రోవైపు సామ్ న‌టిస్తున్న 'యశోద' చివరి షెడ్యూల్ షూటింగ్ లో ఉంది. ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. అలాగే త‌న‌ 'శాకుంతలం' విడుదల కోసం ఎదురుచూస్తోంది.

విజయ్ దేవరకొండతో కలిసి న‌టిస్తున్న 'ఖుషీ' షెడ్యూళ్లు కొన‌సాగుతున్నాయి. రెండవ షెడ్యూల్ జూన్ 8 నుండి కొన‌సాగుతోంది. అలాగే అవెంజ‌ర్స్ మేక‌ర్స్ రస్సో బ్రదర్స్ నిర్మిస్తున్న 'సిటాడెల్'లోనూ సామ్ న‌టిస్తోంది. వరుణ్ ధావన్- స‌మంత‌ ప్రధాన పాత్రల్లో రాజ్ నిడిమోరు -కృష్ణ డికె ద‌ర్శ‌క‌త్వంలో ఈ సిరీస్ తెర‌కెక్క‌నుంది. జూలై నుంచి ఈ సిరీస్ సెట్స్ పైకి వెళుతుంద‌ని స‌మాచారం. ఫ్యామిలీమ్యాన్ 2 త‌ర్వాత సామ్ కి రాజ్ అండ్ డీకేతో అద్భుత అవ‌కాశ‌మిది. బాఫ్టా-విజేత దర్శకుడు ఫిలిప్ జాన్ తెర‌కెక్కించ‌నున్న‌ చిత్రం 'అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్‌'తో సమంత హాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది.