Begin typing your search above and press return to search.

ఒక్క ముక్కలో దేవరకొండ లెవెల్ పెంచిన సమంత

By:  Tupaki Desk   |   26 July 2022 12:00 PM IST
ఒక్క ముక్కలో దేవరకొండ లెవెల్ పెంచిన సమంత
X
టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వకముందే అక్కడ మంచి క్రేజ్ అయితే అందుకుంటూ వస్తున్నాడు. సినిమాల రిజల్ట్ సంగతి పక్కన పెడితే విజయ్ దేవరకొండ ఒక విధంగా రెగ్యులర్గా మీడియాలో హాట్ టాప్ గా మారుతూనే ఉన్నాడు. అతని నెక్స్ట్ సినిమాల పై బాలీవుడ్ లో అయితే కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి.

ఇక తరచుగా కొంతమంది హీరో హీరోయిన్స్ కూడా విజయ్ దేవరకొండ పేరును ప్రస్తావనకు తీసుకువస్తూ ఇంటర్వ్యూలలో అతని రేంజ్ కూడా పెంచుతున్నారు. రీసెంట్గా సమంత కూడా ప్రముఖ షోలో విజయ్ లెవెల్ పెంచేలా అతనికి ఒక ట్యాగ్ కూడా ఇచ్చేసింది.

సమంత రూత్ ప్రభు ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రోగ్రాం లో అనేక విషయాలపై మాట్లాడిన సమంత విజయ్ దేవరకొండ గురించి కూడా తెలియజేసింది.

అయితే ముందుగా మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఇన్ ఇండియా అనే ట్యాగ్ ఎవరికి ఇస్తావు అని అడిగినప్పుడు సమంత ఆలోచనలో పడింది. అయితే అప్పుడే కరణ్ రన్వీర్ సింగ్ అని మాత్రం చెప్పకూడదు అని ముందుగానే చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

పక్కనున్న అక్షయ్ కుమార్ కూడా ఆ ప్రశ్నకు షాక్ అయ్యాడు. ఎందుకంటే ఈటీవల చాలామంది అతని పేరు చెబుతున్నారు అని నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిందిగా కోరడంతో ఆమె వెంటనే విజయ్ దేవరకొండ పేరును చెప్పేస్తుంది.

ఇది నేను అందరిని చూసి చెప్పడం లేదు అని విజయ్ దేవరకొండ తో నెలరోజుల పాటు ఖుషి సినిమా షూటింగ్ చేశాను కాబట్టి అతని గురించి పూర్తిగా అర్థమైంది అందుకే మోస్ట్ డిసైరబుల్ మాన్ ఇండియా అని వివరణ ఇచ్చింది. ఇక సమంత ఆ మాట చెప్పగానే ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుకు ముందుకు సంబంధించిన క్లిప్ కూడా వైరల్ గా మారిపోయింది. దేవరకొండ ఫ్యాన్స్ కూడా సమంత మాటలకు ఫిదా అవుతున్నారు