Begin typing your search above and press return to search.

సమంత స్టయిల్‌ ఐకన్‌ -విక్రమ్‌

By:  Tupaki Desk   |   14 Aug 2015 11:43 AM IST
సమంత స్టయిల్‌ ఐకన్‌ -విక్రమ్‌
X
అందాల సమంత ఇన్నేళ్ల కెరీర్‌ లో ఏనాడూ అందుకోని ఓ గొప్ప ప్రశంస అందుకుంది. చియాన్‌ విక్రమ్‌ అంతటివాడే ఈ అమ్మడిని స్టయిల్‌ ఐకన్‌ అని ప్రశంసించాడంటే ఈ భామ గొప్పతనాన్ని మెచ్చుకోవాల్సిందే. ఇటీవలే 10ఎంద్రాతుకుళ్ల ట్రైలర్‌ లాంచ్‌ లో చియాన్‌ సమంత గురించి ప్రస్థావిస్తూ ఆకాశానికెత్తేశాడు. సమంత గొప్ప అందగత్తె. స్టయిల్‌ ఐకన్‌. తను నాకు గ్రేట్‌ ఫ్రెండ్‌. సూపర్భ్‌ పెర్ఫామర్‌ అంటూ చియాన్‌ తెగ పొగిడేశాడు. నటనలో, లుక్‌ లో సమంత స్టయిల్‌ గా కనిపిస్తుంది. షీ ఈజ్‌ సో స్పెషల్‌. తను ఇంకా చాలా చిన్న అమ్మాయే. కానీ ఎంతో మెచ్యూరిటీ ఉన్న హీరోయిన్‌. ఇప్పట్నుంచో సమాజానికి ఉపయోగపడే మంచి పనులెన్నో చేస్తోంది.. అంటూ తనలోని గొప్పతనాన్ని పొగిడేశాడు.

అప్పట్లో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సమంత ఇన్నర్‌ పర్సనాలిటీ గురించి ఆకాశానికెత్తేశాడు. ఇప్పుడు మరోసారి విక్రమ్‌ సమంతలోని ఇన్నర్‌ క్వాలిటీస్‌ ని, అందాన్ని పొగిడేయడం కోలీవుడ్‌ లో చర్చకొచ్చింది. 10 ఎంద్రాతుకుళ్ల అక్టోబర్‌ లో రిలీజ్‌ కి వస్తోంది. ఈ చిత్రంలో చియాన్‌ ఓ ట్రక్‌ డ్రైవర్‌. చెన్నయ్‌ నుంచి ఉత్తరాఖండ్‌ వరకూ హైవే లో ఆ ట్రక్‌ ప్రయాణిస్తుంది. ఆ క్రమంలో ఏం జరిగిందన్నదే సినిమా. విజయ్‌ మిల్టన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.