Begin typing your search above and press return to search.

100% మంచి నాన్న అవుతాడు: సమంతా

By:  Tupaki Desk   |   2 July 2019 6:29 AM GMT
100% మంచి నాన్న అవుతాడు: సమంతా
X
సమంతా అక్కినేని కొత్త సినిమా 'ఓ బేబీ' జులై 5 ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సమంతా ఫుల్ జోష్ లో ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమంతా పలు విషయాలపై తన అభిప్రాయాలు పంచుకుంది. దర్శకురాలు నందిని రెడ్డి గురించి మాట్లాడుతూ.. నందిని తనకు అక్కలాంటిదని.. తనను వందశాతం నమ్ముతానని తెలిపింది.

ఇప్పటివరకూ తను పోషించిన పాత్రలలో 'ఓ బేబీ'లోనిది ది బెస్ట్ రోల్ అని తెలిపింది. అంతే కాకుండా ఈ సినిమా తనకు ఎంతో ఛాలెంజింగ్ అనిపించిందని వెల్లడించింది. రాజేంద్రప్రసాద్ నుండి కామెడీ టైమింగ్ నేర్చుకున్నానని.. ఈ సినిమాకు అది చాలా ఉపయోగపడిందని తెలిపింది.. ఈ సినిమాలో నాగశౌర్య పాత్ర ఒక హైలైట్ అని.. ఈ సినిమాలో నటించేందుకు శౌర్య ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపింది.

'ఓ బేబీ' షూటింగ్ సమయంలో సమంతా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.. ఈ విషయంపై స్పందిస్తూ అవి జస్ట్ రూమర్స్ మాత్రమే అని.. రాజీవ్ మసంద్ ఇంటర్వ్యూలోనే వాటిపై క్లారిటీ ఇచ్చానని తెలిపింది. ఇక తన స్వీట్ హబ్బీ నాగ చైతన్యపై ప్రశంసల వర్షం కురిపించింది. చైతు ఒక మంచి భర్త అని.. తను 100 % మంచి నాన్న అవుతాడనే నమ్మకం ఉందని చెప్పింది. 'ఏ మాయచేసావే' సమయానికి 'మజిలీ' కి నాగచైతన్యలో వచ్చిన మార్పు గురించి చెప్పమంటే.. అప్పటి కంటే చైతన్య ఫోకస్ ఇప్పుడు ఎక్కువగా ఉంది.. భాద్యత కూడా పెరిగిందని చెప్పుకొచ్చింది.